Take a fresh look at your lifestyle.

వర్షాకాలం వరకు ఎల్లంపల్లికి నీటిని తరలించాలి

వర్షాకాలం వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు 3 టీఎంసీల నీరు చేరాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. గురువారం ఆయన సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్‌, ‌నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ రజత్‌ ‌కుమార్‌లు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మొదటి లింకులో అదనపు టీఎంసీ తరలింపు పనులను ఉన్నతాధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. మంత్రి అధ్యక్షతన ఉన్నతాధికారుల బృందం మేడిగడ్డ(లక్ష్మి) పంప్‌ ‌హౌస్‌ను, అన్నారం (సరస్వ తి) పంప్‌ ‌హౌస్‌ ‌లో మూడవ టిఎంసి పనులను పరిశీలించా రు. అనంతరం గోలివాడ (పార్వతి) పంప్‌ ‌హౌస్‌లో మూడో టీఎంసీ తరలింపు నిర్మాణ పనులను పరిశీలించి అక్కడ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సంధ ర్భంగా ఆయన పలు విషయాలు చర్చించారు. గతంలో సాగునీటి ప్రాజెక్టులు ఏళ్ల తరబడి నిర్మించేవారని, దేశంలోనే రికార్డు సమయంలో భారీ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకు న్నామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి లింకులో మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి వరకు ప్రతిరోజు 3 టీఎంసీలు ఎత్తి పోసే విధంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికా రులను మంత్రి ఆదేశించారు.

కోవిడ్‌ 19 ‌వైరస్‌ ‌వ్యాప్తి నేపథ్యంలో అవసరమైన మేర కూలీలు అందుబాటులో లేకపోవడంతో కొంత ఆలస్యం జరిగిందని, లాక్‌ ‌డౌన్‌ ఎత్తి వేస్తున్న నేపథ్యంలో సమస్యలను అధిగమించి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. 3వ టీఎంసీ తరలింపునకు అవసరమైన పంపులు, మోటార్లు విదేశాల నుంచి తెచ్చుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ అవ లంభించాలని, నీటి ఎత్తిపోతలకు సంబంధించిన మేధావు లను సంప్రదించాలని మంత్రి అధికారులకు సూచించారు. జూన్‌ ‌మొదటి వారంలో మొదటి లింకులు అవసరమైన పంపులు మోటార్లు వస్తాయని, వాటి ఫిట్టింగ్‌ ‌కమిషనింగ్‌ ‌జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. జూన్‌ 15 ‌వరకు 2 పంపులు, జులై 15 వరకు మిగిలిన 4 పంపుల ఫిట్టింగ్‌ ‌కమిషనింగ్‌ ‌పూర్తవుతుందని అధికారు లు వివరించారు. ప్రస్తుత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్‌ ‌ప్రారంభంలో ప్రవాహం మొదలయ్యే అవకా శం ఉందని, అప్పటివరకు వీలైనంత త్వరగా పని పూర్తి చేసి ఎత్తిపోతలకు సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించా రు. మోటార్లు పంపులు బిగింపు పనులు అని పంప్‌ ‌హౌస్‌ ‌లో సమాంతరంగా జరగాలని మంత్రి ఆదేశించారు.

జూన్‌ ‌మాసం చివరి వరకు ఎల్లంపల్లి రిజర్వాయర్‌ ‌వరకు ప్రతిరో జు 2.5 టీఎంసీల ఎత్తిపొస్తామని, ఆగస్టు చివరి వరకు ప్రతిరోజు మూడు టీఎంసీల ఎత్తి పోసే పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. నీటి తరలింపు లకు అవసరమైన విద్యుత్‌ ‌సరఫరా చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, విద్యుత్‌ ‌సరఫరాకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని, అదనపు టీఎంసీ తరలింపునకు అవసరమయ్యే విద్యుత్‌ అం‌దించేందుకు వీలుగా అదనపు లైన్లు, ట్రాన్స్ ‌ఫార్మర్లు సబ్‌ ‌స్టేషన్లను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి విద్యుత్‌ అధికారులకు ఆదేశించారు. 3వ టీఎంసీ తరలింపునకు సంబంధించి సివిల్‌ ‌పనులు పూర్తి చేసుకున్నామని, ఎలక్ట్రో మెకానికల్‌ ‌పనులు పూర్తిచేసి వచ్చే వానకాలం సీజన్లో నీటిని ఎత్తిపోసెందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. పెద్దపల్లి జిల్లాలో కోవిడ్‌ 19 ‌వైరస్‌ ‌వ్యాప్తి నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకు న్నామని, వలస కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కంపెనీ వారితో చర్చించామని, సమస్యలు పరిష్కరించమని కలెక్టర్‌ ‌వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి లింకులో 3వ టీఎంసీ తరలింపు పనుల పురోగతిపై సిఎం కేసిఆర్‌ ఆరా తీశారు, పనులు వేగవంతంగా పూర్తి చేయాల ని అధికారులను ఆదేశించారు. సమావేశంలో నీటిపారుద ల శాఖ ఈఎన్సి మురళీధర్‌, ‌కాళెశ్వరం ప్రాజెక్టు ఈఎన్సి వెంకటేశ్వర్లు, మెగా ఇంజనీరింగ్‌ అం‌డ్‌ ఇ‌న్ఫ్రాస్ట్రక్చర్‌ ‌లిమిటెడ్‌ ఎం‌డీ కృష్ణారెడ్డి, ఎత్తిపోతల నిపుణులు పెంటా రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!