Take a fresh look at your lifestyle.

రైతుల సమస్యలను పరిష్కరించాలని మౌనదీక్ష

రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేస్తూ తెలంగాణ జన సమితి పార్టీ ఆద్వర్యంలో తెజస నియోజకవర్గ ఇంచార్జి కంతి మోహన్‌రెడ్డి తెజస నాయకులతో కలిసి మంగళవారం మౌనదిక్ష చేపాట్టారు.

ఈ సంధర్భంగా మోహన్‌రెడ్డి మాట్లడుతూ కోనుగోలు కేంద్రాల్లో తప్ప తరుగు పేరుతో క్వీంటల్‌కు 5 కీలోలు కట్‌ ‌చేసిన వాటికి డబ్బులు ప్రభుత్వం కట్టివ్వాలని, హమాలీ చార్జిలు ప్రభుత్వమే చెల్లించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో కరోనా పరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని,వలస కార్మికులను ప్రభుత్వమే వారి స్వంత స్థలాలకు తెప్పించాలని, గల్ఫ్‌లో ఉన్న వారిని క్షేమంగా తెలంగాణకు తీసుకురావాలని, చిన్న సన్నకారు రైతులను, కార్మికులను ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి అదుకోవాలని, మధ్యం దుకాణాలు తెరిస్తే కరోనా నివారణ సాధ్యం కాదని పూర్తిగా మధ్యపాన నిషేదం చేపట్టాలని తెలంగాణ జన సమతి తరుపున డిమాండ్‌ ‌చేస్తున్నామని అన్నారు.  మాజీ ఎంపీటీసీ గూడ రాజారెడ్డి, టిజెఎస్‌ ‌జిల్లా ఉపాధ్యాక్షుడు కంతి ఆనంద్‌, ‌మండలాధ్యక్షుడు కంతి రమేష్‌, ‌నాయకులు ఒడ్డే సోమేష్‌, ‌రెబ్బటి మల్లయ్య, రాజశేఖర్‌, ‌రణధీర్‌, ‌గంగాధర్‌, ‌శ్రీనివాస్‌, అరవింద్‌, ‌మల్లయ్య, నవీన్‌, ‌రాజేష్‌, ‌నర్సయ్య, రాములు పాల్గోన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply