ఉపాధి హామీ కూలీలు పనుల సమయాల్లో సామాజిక దూరం పాటించాలని, కచ్చితంగా మాస్క్ లు ధరించాలని పల్లివాడ సర్పంచ్ కడమంచి సంధ్యస్వామి అన్నారు. మంగళ వారం గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధిహామీ పనులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధి హామీ కూలీలకు పలు సూచనలు చేసి మస్టరును తనిఖీచేశారు. పనికి వచ్చిన వెంటనే సంతకాలు చేయాలని కోరారు. ఇంటికి వెళ్లే ముందు చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలని, పనిచేసే వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కల్లూరి నగేష్, పంచాయతీ కార్యదర్శి సుమన్, వార్డు సభ్యులు పాల్గొన్నారు