Take a fresh look at your lifestyle.

రింగ్‌ ‌రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : కలెక్టర్‌

నిత్యావసర సరుకులు పంపిణి చేస్తున్న అర్‌అం‌డ్‌బియస్‌ ఈఐఐ ‌సిబ్బంది
: అంతర్గత రింగ్‌ ‌రోడ్డు భూ సేకరణ పనులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ‌రాజివ్‌ ‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ ‌మినీ సమావేశ మందిరంలో కుడా చైర్మన్‌, ‌మర్రి యాదవ రెడ్డి, జిడబ్ల్యూఎంసి కమీషనర్‌ ‌పమేలా సత్పతితో కలసి కుడా, రెవిన్యూ అధికారులతో అంతర్గత రింగ్‌ ‌రోడ్డు నిర్మాణ భూ సేకరణ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ నాయుడు పెట్రోల్‌ ‌పంప్‌ ‌నుండి అరెపల్లి వరకు ఏర్పాటు చేయనున్న ఇన్నర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు కు సర్వే పూర్తైనందున భూ సేకరణ చేయాల్సిన గ్రామాలను స్కెచ్‌ ‌ప్రకారం సూక్ష్మ స్థాయిలో అధికారులతో సమీక్షించి త్వరితగతిన చేయుటకు పలు సూచనలు చేశారు. ఈ సమీక్షలో ఆర్డీఓ వెంక రెడ్డి, ఆర్‌అం‌డ్‌బిఇఇ యాల్‌ ‌రాజం, కుడా ప్రణాళిక అధికారి అజిత్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అర్‌అం‌డ్‌బియస్‌ ఈఐఐ ‌వారి సిబ్బంది ఆధ్వర్యంలో…
లాక్‌ ‌డౌన్‌ ‌నేపథ్యం లో నిరుపేదలకు సహాయం చేసేందుకు అర్‌అం‌డ్‌బియస్‌ ఈఐఐ ‌వారి సిబ్బంది ఆధ్వర్యంలో 100 మందికి సరిపోను నిత్యవసర వస్తువుల అర్‌అం‌డ్‌బియస్‌ ఈఏం ‌సత్యనారాయణ ఇఐయల్‌ ‌రాజం సిబ్బంది కలిసి జిల్లా కలెక్టర్‌ ‌రాజీవ్‌ ‌గాంధీ హనుమంతుకు అందజేశారు. ఈ సందర్భంగా బియ్యం, పప్పు దినుసులు, పసుపు అల్లం ఏళ్ళి గడ్డలు గోధుమ పిండి ఇతర వస్తువుల కలిపి 100ప్యాకెట్లను జిల్లా కలెక్టర్‌ ‌కు అందజేసినట్లు అర్‌అం‌డ్‌బి ఇఇ రాజం తెలిపారు.

జాగృతి ఆధ్వర్యంలో… కరోనాని నివారించడంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదేశాల మేరకు లక్షా మస్కులు పంపిణీ చేశారు. మంగళవారం మస్కులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌రాజీవ్‌ ‌గాంధీ హనుమంతు, వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌కు 3000ల మాస్క్‌లు సిపి రవీందర్‌కు తెలంగాణ జాగృతి యువత అధ్యక్షుడు విజయ్‌ ‌కుమార్‌ ఈ ‌కార్యక్రమంలో వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా అధ్యక్షుడు బండారి సుమన్‌, ‌రాష్ట్ర నాయకులు బొంపెల్లి సోమేశ్వర రావు, రోహిత్‌, ‌రమేష్‌, ‌శంకర్‌ ‌పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!