Take a fresh look at your lifestyle.

52 ‌మంది మావోయిస్టు మిలీషియా సభ్యుల లొంగుబాటు

వివరాలు వెల్లడించిన ‘భదాద్రి’ జిల్లా ఎస్పీ సునీల్‌ ‌దత్‌

చర్ల మండలంలోని పూసుగుప్ప బట్టీగూడెం, బత్తినపల్లి, చెన్నాపురం గ్రామాలలో సంచరిస్తున్న 52 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు గురువారం భదాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌ ‌దత్‌ 141 ‌సిఆర్‌పిఎఫ్‌ ‌బెటాలియన్‌ ‌కమాండెంట్‌ ‌సమక్షంలో లొంగిపోయారు. వీరిలో ఐదుగురు మహిళా సభ్యులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. చర్ల ఏరియా కమిటి కార్యదర్శి అదనపు సానుభూతి పరులుగా గత ఏడాది నుండి మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇటీవల లొంగిపోయిన వ్యక్తులు పెసర్లపాడు, పుట్టపాడు మరియు అటవీ ప్రాంతంలో శిక్షణకు బలవంతంగా మావోయిస్టు పార్టీ తీసుకువెళ్ళిందని తెలిపారు.

మావోయిస్టు భావజాలంతో విసుగుచెంది జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమవద్దకు వొచ్చారని తెలిపారు. మావోయిస్టు పార్టీ నుండి నిత్యం వీరు వేధింపులకు గురవుతూ ఉన్నారని తెలిపారు. మావోయిస్టు పార్టీ సిద్దాంతాలను వదిలివేసి ప్రశాంత జీవనం గడుపాలని లొంగిపోయినట్లు తెలిపారు. మరికొంత మంది మావోయిస్టు పార్టీ చెరలో ఉన్న సానుభూతిపరులు బయటకు వొచ్చి మంచి జీవితాన్ని గడపటానికి తమ బంధువుల ద్వారా లేదా నేరుగా పోలీసులను, సమీపంలో ఉన్న పోలీస్‌ ‌స్టేషన్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు. మావోయిస్టు పార్టీ సభ్యులు వారి నాయకులందరు తమ ఆయుధాలతో లొంగిపోవాల్సిందిగా ఎస్పీ విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశంలో చర్ల సిఐ మరియు సిఆర్‌పిఎఫ్‌ 141 ‌బెటాలియన్‌ ‌కమాండెంట్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply