Take a fresh look at your lifestyle.

తెలంగాణకు 5 వేల కోట్ల నష్టం నోరుమెదపని కేసీఆర్‌

5000 crore loss to Telangana former Union finance minister Chidambaram
‌కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం విమర్శ

కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల పంపిణీలో వివక్ష కారణంగా రాష్ట్రాలు నష్టపోతున్నాయని ఎనిమిదిన్నర లక్షల కోట్లకు గాను ఆరున్నర లక్షల కోట్లే కేంద్రం పంచిందని కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం అన్నారు. పన్నుల వాటాలో తెలంగాణ రాష్ట్రం రూ. 5వేల కోట్లు నష్టపోయిందని అయినా కేసీఆర్‌ ‌కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఓ ‌సారి మోడీకి అనుకూలంగా మరోసారి వ్యతిరేకంగా మాట్లాడుతారని కేంద్రంపై తన వైఖరి విషయంలో ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. దేశ ఆర్ధిక వ్యవస్థకు చికిత్స చేసే పరిస్తితి కూడా లేదని,ప్రధాని మోడీ నిర్ణయాలతో ఇండియా ఆర్ధిక వ్యవస్థ ఐసియు లో ఉందని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం విమర్శల జల్లు కురిపించారు.శనివారం బంజారాహీల్లస్ ‌లోని ముఫకంజా కళాశాలలో యూనియన్‌ ‌బడ్జెట్‌ 2020 21‌పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….దేశం ఆర్థిక మందగమనంలో ఉన్న ప్రస్తుత పరిస్థితిలో మాజీ ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌ ‌లాంటి డాక్టర్‌ ఈ ‌దేశ ఆర్ధిక వ్యవస్థకు అవసరమని అన్నారు .మోడీ చెప్పిన అచ్చే దిన్‌ ఎక్కడా కనిపించడం లేదని ధ్వజమెత్తారు.,ఆర్ధిక మంత్రి బడ్జెట్‌ ‌లో చెప్పిన అంకేలన్నీ తప్పేనని ఆరోపించారు. బడ్జెట్‌ ‌ప్రతిఫలాలు పొందాల్సింది పేదలు కానీ ఈ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధిని కూడా గాలికొదిలేసిందనీ, ఈ కారణంగా దేశంలో అనేక చిన్న మధ్య తరహా పరిశమ్రలు మూతపడ్డాయని ఆరోపించారు.

ఆటోమొబైల్‌ ‌సంస్తలు సంక్షోభంలోకి వెళ్లాయనీ, పెట్టుబడులు లేక దేశంలో ఉత్పత్తులు నిలచిపోయాయనీ, దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. పార్లమెంటులో బడ్జెట్‌ ‌ప్రసంగం సందర్భంగా ఆర్ధిక మంత్రి చెప్పిన అంకేలన్నీ తప్పేనని పేర్కొన్నారు. పేదలకు వ్యతిరేకంగా ఉన్న బడ్జెట్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశ•పెట్టిందనీ, పేదలకు బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకం అనడానికి బడ్జెట్‌ ‌లెక్కలే నిదర్శనమన్నారు. బడ్జెట్‌ ‌లోమోడీ ప్రభుత్వం ఆహార అవసరాలకు లక్ష కోట్లు తగ్గించిందనీ, ఇది క్రూరమైన మనసులేని ప్రభుత్వమని మండిపడ్డారు.ఆయస్మాన్‌ ‌భారత్‌ ‌కు గత బడ్జెట్‌ ‌లో రూ. 6500కోట్లు పెడితే ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం 3300 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టిందనీ, ఇలా ఐతే ఆయస్మాన్‌ ‌భారత్‌ ‌లక్ష్యం ఎలా నెరవేరుతుందని ప్రశ్నించారు..? పెద్ద నోట్ల రద్దు మోడీ తికున్న ఓ గుడ్డి నిర్ణయమని విమర్శించారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలపై దీని ప్రభావం పడిందనీ, దేశ ఆర్థికాభివృద్ధి 8.5 శాతం నుంచి 5 శాతానికి పడిపోయిందని విమర్శించారు. ఈ బడ్జెట్‌లో ఆహార, వ్యవసాయ రంగాలకు రూ. లక్ష కోట్ల మేర కోత విధించారనీ, మధ్యాహ్న భోజన పథకాన్నీ విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ,మాజీ మంత్రులు జానారెడ్డి ,గీతారెడ్డి ,మర్రి శశిధర్‌ ‌రెడ్డి ,పొన్నాల లక్ష్మయ్య ,షబ్బీర్‌ అలీ ఇతర కాంగ్రెస్‌ ‌పార్టీ. నాయకుల హాజరైయ్యారు.

Leave a Reply