Take a fresh look at your lifestyle.

ఏపి లో కొరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 5లక్షల పరిహారం

సిఎం జగన్‌ ‌హామీ
వివరాలు వెల్లడించిన ఐజెయు అధ్యక్షుడు శ్రీనివాస్‌ ‌రెడ్డి, 
ఎపి మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌
అమరావతి, అక్టోబర్‌ 13 : ‌ప్రాణాంతక కొరోనా వైరస్‌ ‌కారణంగా మరణించిన ప్రతి జర్నలిస్ట్‌కు రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి హా మీ ఇచ్చారు. ఇండియన్‌ ‌జర్నలిస్ట్ ‌యూనియన్‌ అధ్యక్షులు కే శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని మంగళవారం వి•డియా ముందు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలో కొరోనా వల్ల అనేక మంది చనిపోతున్నారు. దీనిలో జర్నలిస్టులు కూడా మృత్యువాత పడ్డారు. వార్తా సేకరణ క్రమంలో అందరూ ముందుండి నడిచారు. ప్రధాని కూడా జర్నలిస్ట్‌లు కొరోనా వారియర్స్ అని చెప్పారు. జర్నలిస్టులను ప్రభుత్వాలు కూడా సహకారం ఇవ్వాలి. 50 లక్షలు బీమా ఇవ్వాలని కోరుతున్నాం. ఏపీలో 38 మంది జర్నలిస్టులు మృతి చెందారు.
వారిని ఆదుకోవాలని ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. 38 మంది చనిపోయారని ముఖ్యమంత్రి జగన్‌ ‌చెప్పారు. చనిపోయిన జర్నలిస్ట్ ‌కుటుంబాలకు 5 లక్షలు ఇస్తానని సీఎం హావి• ఇచ్చారు. చికిత్స తీసుకునే వారికి కూడా ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు చేస్తామని హావి• ఇచ్చారు. సీఎంకు, దీనికి సహకరించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవులపల్లి అమర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎపి జాతీయ వి•డియా సలహాదారు దేవులపల్లి అమర్‌ ‌మాట్లాడుతూ..కోవిడ్‌ ‌వల్ల చనిపోయిన జర్నలిస్ట్ ‌కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం జగన్‌ ‌ముందుకు రావడం మంచి పరిణామం అన్నారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగానే ఆయన చాలా సానుకూలంగా స్పందించారని, యూనియన్లు కేంద్రం ప్రకటించిన 50 లక్షల బీమాను డిమాండ్‌ ‌చేస్తున్నాయని, అయినా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల వెనుక ఉండి ఆదుకునేందుకు ముందుకు వచ్చిందని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎపి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని నిరూపితమైందని, భవిష్యత్తులో కూడా సీఎం జగన్‌ ‌జర్నలిస్టుల వెనుక ఉంటారనే నమ్మకం ఉందని అమర్‌ అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply