- కారు ప్రమాదంలో ముగ్గురు…వారిని చూసేందుకు వెళ్లి ఇద్దరు దుర్మరణం
- ప్రమాదంలో సిఐ, కానిస్టేబుల్ సహా 12మందికి గాయాలు
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణ శివారులోని కరీంనగర్-హైదరాబాద్ రాజీవ్ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు దుర్మరణం పాలయ్యారు. సిఐ, కానిస్టేబుల్ సమా 12మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హుజూరాబాద్‌కు చెందిన అడ్వకేట్ నర్సింహారెడ్డి ఆయన తండ్రి రాజిరెడ్డి, తల్లి విజయ కారులో హైదరాబాద్ వెళ్తుండగా…సిద్ధిపేట పట్టణ శివారులోని రంగీల దాబా చౌరస్తాలో డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ యాక్సిడెంటులో అడ్వకేట్ నర్సింహారెడ్డి, ఆయన తండ్రి రాజిరెడ్డి, తల్లి విజయ అక్కడికక్కడే చనిపోయారు.
వీరి స్వగ్రామం పెద్దపల్లి. అయితే, రంగీలా చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తెలుసుకున్న సిద్ధిపేట టూటౌన్ సిఐ పరుశరాంగౌడ్, ఎస్ఐ కనకయ్యగౌడ్, కానిస్టేబుళ్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్చలు చేస్తుండగా..కరీంనగర్ నుంచి అతి వేగంగా వొచ్చిన డిసిఎం(నెంబర్, ఏపి 03యు 2439) పోలీసులు, సంఘటనా స్థలాన్ని చూసేందుకు వొచ్చిన వారిపైకి దూసుకెళ్లింది. డిసిఎం ఢీ కొనడంతో సంఘటనా స్థలాన్ని చూసేందుకు వొచ్చిన మందపల్లికి చెందిన ఎల్లారెడ్డి(రేషన్ డీలర్) రామునిపట్లకు చెందిన మల్లేశం అక్కడికక్కడే చనిపోగా…టూటౌన్ సిఐ పరుశరాంగౌడ్, కానిస్టేబుల్ సహా 12మంది తీవ్రంగా గాయపడ్డారు.