Take a fresh look at your lifestyle.

5ఏళ్ళలో.. సంపద రెట్టింపు

‘వాస్తవ’ బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టిన అసెంబ్లీలో కేసీఆర్‌ .. ‌మండలిలో హరీష్‌ ‌రావుఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపైందని, రెండేళ్లకు ముందు 4.2శాతం ఉన్న జీస్‌డీపీ.. 2018-19లో 10.5శాతానికి పెరిగిందని రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కేసీఆర్‌ ‌స్వయంగా రూ. 1,46,492.3కోట్లతో రాష్ట్ర బ్జడెట్‌ను ప్రవేశపెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు, మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు, బ్జడెట్‌ అం‌చనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు, రాష్ట్ర ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లుగా చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అద్భుత ప్రగతిని సాధిస్తోందన్నారు. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు… యావత్‌ ‌దేశాన్ని ఆశ్చర్యపరిచాయని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. దేశంలోనే నంబర్‌వన్‌ ‌రాష్ట్రంగా తెలంగాణ సగర్వంగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటుకు రెండేళ్లకు ముందు 4.2శాతం ఉన్న జీఎస్‌డీపీ.. 2018-19లో జీఎస్‌డీపీ 10.5శాతానికి పెరిగిందన్నారు. ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపు అయిందని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. మూలధన వ్యయంలో దేశంలో అగ్రగామిగా ఉందన్నారు. నిధుల ఖర్చులో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వాటా తక్కువగా ఉండేదన్నారు. 16.3శాతం మూలధనం వ్యయంతో తెలంగాణ అగ్రస్థానాన్ని ఆక్రమించిందని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. మూలధనం వ్యవయంలో కేంద్రానిది కేవలం 12.8 శాతం అని.. గత ఐదేళ్లలో మూలధనం కింద రూ.1,65, 167 కోట్లు ఖర్చు చేశామన్నారు. తెలంగాణలో సగటు ఆదాయ వృద్ధి రేటు 21.49 శాతం అని.. సమర్ధవంతమైన ఆర్థిక నిర్వహణతో అద్భుతాలు వస్తాయని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యుత్‌ 24 ‌గంటల పాటు ఇవ్వడంతో… పారిశ్రామిక, వ్యవసాయరంగం పునరుత్తేజం సాధించాయని తెలిపారు. రైతుబంధు పథకం వ్యవసాయరంగానికి తోడ్పాటునందించిందని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణలో సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించామన్నారు. వ్యవసాయరంగంలో 8.1శాతం వృద్ధిరేటు సాధించామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 1.8 శాతం నుంచి 6.3శాతం వృద్ధి సాధించామని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. పారిశ్రామికరంగంలో 5.8 శాతం వృద్ధి రేటు.. సేవలరంగంలో 11.8శాతం వృద్ధిరేటు నమోదైందన్నారు. 2014-15లో ఐటీ ఎగుమతులు రూ.52 వేల కోట్లు అని.. 2018-19 నాటికి రూ.లక్షా 10 వేల కోట్లకు చేరుకున్నాయన్నారు. తెలంగాణలో కనీవినీ ఎరుగుని రీతిలో విద్యుత్‌ ఉత్పాదన జరిగిందని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు.
బడ్జెట్‌ ‌పూర్తి పాఠం ఈపేపర్‌లో…
epaper.prajatantranews.com

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy