Take a fresh look at your lifestyle.

24 ‌గంటల్లో కొత్తగా 463 కేసులు రాష్ట్రంలో పెరుగుతున్న కొరోనా కేసులు

రాష్ట్రంలో కొరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 463 కేసులు నమోదయ్యాయి. కొరోనా వైరస్‌ ‌వల్ల సోమవారం నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,07,205 మందికి వైరస్‌ ‌సోకగా..కొరోనాతో 1,694 మరణాలు సంభవించాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 4,678 యాక్టివ్‌ ‌కేసులు ఉండగా.. కొరోనా నుంచి 3,00,833 మంది రికవరీ అయినట్లు మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ ‌బులిటెన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో పాజిటివ్‌ ‌కేసులు పెరుగుతుండటంతో పలు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వ అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Reply