Take a fresh look at your lifestyle.

వలస కార్మికుల మనసు అర్థం చేసుకున్న సీఎం

వలస కార్మికుల మనసు అర్థం చేసుకున్న మనసున్న మారాజు మన సీయం కేసీఆర్‌ అని కోరుకంటి చందర్‌ ‌హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌ ‌సిఎల్‌ ‌సంస్థల్లో పనిచేస్తున్న వలస కార్మికులు తమ స్వస్థలాలకు అనుమతి పత్రాలను అందజేశారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ‌మాట్లాడారు. ఎన్టీపీసీ, ఆర్‌ ‌సిఎల్‌ ‌సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు 42 రోజులుగా సకల సౌకర్యాలు కల్పించామని చెప్పారు. ఈ ప్రాంతంలో బిహర్‌, ‌ఛత్తీస్‌ ‌ఘడ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌జార్ఖండ్‌, ‌మహరాష్ట్ర రాష్ట్రాలకు చెందిన 5000వేల మంది వలస కార్మికులు పనిచేస్తున్నారని వారి అంక్షాల మేరకు కొంత మందిని వాహనాల ద్వారా తరలించడం జరుగుతుందని, మిగిత కార్మికులను రైలు మార్గంద్వారా తమ సొంత గ్రామాలకు పంపనున్నట్లు తెలిపారు.

కరోనా వైరస్‌ ‌నేపద్యంలో రాష్ట్రం లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఇక్కడే ఉండిపోయారన్నారు.  వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బియ్యం, నగదు పంపిణి చేసి వారికి సకల సౌకర్యాలు అందించామని వివరించారు. కార్యక్రమంలో నగర మేయర్‌ ‌డాక్టర్‌ ‌బంగి అనిల్‌ ‌కుమార్‌, ‌డిప్యూటీ మేయర్‌ ‌నడిపెల్లి అభిషేక్‌ ‌రావు, పెద్దపల్లి డిసిపి రవీందర్‌, ‌గోదావరిఖని ఎసిపి ఉహిందర్‌, ‌సిఐలు కరుణాకర్‌, ‌పర్శ రమేష్‌, ‌కార్పోరేటర్లు ఎన్‌.‌వి.రమణరెడ్డి, కుమ్మరి శ్రీనివాస్‌ ‌తదితరులున్నారు.

Leave a Reply