కమలాపూర్ మండ లంలో బుధవారం 148 మంది కరోన అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా 45 మందికి కరోన పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారులు డాక్టర్ సంయుక్త, డాక్టర్ హర్షిని ప్రియ, డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 125 మంది కరోన అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా, కమలాపూర్ మండల కేంద్రంలో -14, శంభునిపల్లి-6,కాన్ పర్తి-1, మాదన్నపేట-1, శనిగరం-1, నేరెళ్ల-1,అంబాల-1,ఇతర మండలాలకు చెందిన-7 కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్నారు.
ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 56 మంది కరోన అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా, ఉప్పల్-5, బింపల్లి-1,కన్నూరు-6 కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్నారు. మండలంలో 45 మంది కరోన బాధితులకు కరోనా కిట్లను అందజేసి హోమ్ క్వారంటైన్ కు తరలించినట్లు వైద్య అధికారులు తెలిపారు.