వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

45 ‌లక్షల ఎకరాలకు.. తాగు , సాగు నీరు

August 28, 2019

‘కాళేశ్వరం’ మహాఅద్భుతం..!
ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ల బృందం

కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌జిల్లా కలెక్టర్లందరి ఒక స్పూర్తిదాయకంగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ‌నేతృత్వంలో బుధవారం రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, కన్నెపల్లిను సందర్శించి బ్యారేజీని, పంప్‌హౌజ్‌లను పరిశీలించారు. మంగళవారం వరంగల్‌లో బస చేసిన కలెక్టర్ల బృందం బుధవారం ఉదయమే ప్రత్యేక బస్సు ద్వారా బయలుదేరి ఉదయం 9గంటలకు మేడిగడ్డ చేరగా జిల్లా కలెక్టర్‌ ‌వాసం వెంకటేశ్వర్లు అధ్యక్షతన మేడిగడ్డ బ్యారేజీ క్యాంప్‌ ‌కార్యాలయంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ‌కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇఎస్‌సి ఎన్‌.‌వెంకటేశ్వర్లు కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌గురించి వివరిస్తూ ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో అత్యంత నాణ్యతతో అతివేగంగా నిర్మించిన పెద్ద నీటి పారుదల ప్రాజెక్ట్‌గా అనేక ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆశీస్సులతో ప్రాజెక్ట్ ‌నిర్మాణంలో పాలుపంచుకున్న అన్ని స్థాయిల అధికారులు, ఇంజనీర్లు, వర్కర్ల కృషి ఫలితంగా అనుకున్న సమయాని కంటే ముందే నిర్మాణం పూర్తై ఇంజనీరింగ్‌ ‌మేధావుల ప్రశంసలు పొందిందన్నారు. ఈ సందర్భంగా స్పెషల్‌ ‌సిఎస్‌ ‌సోమేష్‌కుమార్‌ ‌మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కలల పంట కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అన్ని జిల్లాల కలెక్టర్లు పరిశీలించడం హర్షించదగిందని, ఇలాంటి అరుదైన నిర్మాణాలను పరిశీలించి దాని నిర్మాణం గురించి ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోవడం వలన పరిపాలనను పర్యవేక్షించే జిల్లా కలెక్టర్లు స్పూర్తి పొంది భవిష్యత్తులో ఎలాంటి ఛాలేంజింగ్‌ ‌పను)నైనా నైపుణ్యంగా చేయగలిగే నైపుణ్యం అద్భుతమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌నిర్మాణంపై తీసుకున్న శ్రద్ధ చాలా గొప్పదని నేరుగా పర్యటించి ప్రాజెక్ట్ ‌పనులను స్వయంగా పరిశీలించడమే కాకుండా ప్రాజెక్ట్ ‌వద్ద ఏర్పాటు చేసిన సిసి కెమెరాల ద్వారా ప్రతి రోజు ప్రగతి భవన్‌లో లైవ్‌లో పనులను పరిశీలించేవారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌నిర్మాణంలో రెవెన్యూ, ఇరిగేషన్‌, ‌పోలీస్‌ ‌శాఖల సహకారం చాలా ఉందని ప్రాజెక్ట్ ‌నిర్మించేటప్పుడు ఇలాంటి నిర్మాణం జరుగుతదా అని చాలా మంది సందేహం వ్యక్తం చేశారు. కానీ సిఎం కెసిఆర్‌ ‌పట్టుదల, అధికారుల సహకారం, ఇంజనీరింగ్‌ అధికారుల అద్భుత ప్రతిభ వలన అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అనుకున్న సమయానికి ముందే విజయవంతంగా నిర్మించామని, ఈ నిర్మాణానికి భూసేకరణలో చాలా సహకరించిన జయశంకర్‌ ‌జిల్లాలో పనిచేసిన కలెక్టర్లు అమయ్‌కుమార్‌, ‌ప్రస్తుత కలెక్టర్‌ ‌వెంకటేశ్వర్‌లను ప్రశంసించారు. అలాగే భూసేకరణకు సహకరించిన రైతులందరికీ ధన్యవాదాలు అని కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌ద్వారా కొత్త ఆయకట్టు స్థిరీకరణ, పాత ఆయకట్టు పునరుద్దరించడంతో పాటు దాదాపు మొత్తం 45లక్షల ఎకరాలకు సాగునీరు, రాష్ట్రంలోని ఎక్కువ జిల్లాలకు త్రాగునీరు, హైదరాబాద్‌ ‌పారిశ్రామిక అవసరాలకు నీరందుతుందన్నారు. అనంతరం లక్ష్మీ బ్యారేజీ పరిశీలించారు. అక్కడి నుండి కాళేశ్వర చేరుకొని కాళేశ్వరం ముక్తీశ్వరున్ని దర్శించుకొని లక్ష్మీ పంప్‌హౌజ్‌ను పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో కలెక్టర్లతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇం‌జనీర్లు, స్థానిక ఆర్డీవో వెంకటాచారి, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.