Take a fresh look at your lifestyle.

దేశంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు 4421 మరణాల సంఖ్య 117

  • వివరాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌

భారత్‌లో కొరోనా వైరస్‌ ‌వేగంగా విజృంభిస్తుండటంతో కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 254 కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 4421కి చేరింది. అలాగే దేశంలో ఇప్పటివరకు కొరోనా మరణాల సంఖ్య 117గా నమోదు అయ్యింది. 326 మంది వైరస్‌ ‌నుంచి కోలుకుని డిశ్చార్‌ అయ్యారు. ఈ మేరకు కొరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్తి కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ‌హెల్త్ ‌బులెటిన్‌ ‌విడుదల చేశారు. సాకేంతిక పరిజ్ఞానం ఉపయోగించి క్వారంటైన్‌లో ఉన్నవారిని పర్యవేక్షిస్తు న్నామని తెలిపారు.

2500 రైల్వేకోచ్‌ల్లో ఐసోలేషన్‌ ‌వార్డులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.’కొరోనా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆస్పత్రుల్లో అన్ని వైద్య సదుపాయాలు ఉన్నాయి.  కొరోనా సమన్వయానికి కొత్త విధానం. ముంబై, ఢిల్లీ, ఆగ్రా మురికివాడల్లో కొరోనా విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.  భారతీయ రైల్వే 2500 కోచ్‌ల్లో 40వేల ఐసోలేషన్‌ ‌బెడ్స్‌ను సిద్ధం చేసింది.  టెక్నాలజీ సాయంతో క్వారంటైన్‌లో ఉన్న వారిపై నిఘా ఉంచాం. గడచిన 24 గంటల్లో మరో 8 మంది మృతి చెందగా దేశంలో ఇప్పటి వరకు కొరోనా మరణాల సంఖ్య 117కు చేరింది. కోవిడ్‌-19 ‌నుంచి కోలుకొని 326 మంది డిశ్చార్జ్ అయ్యారని’ లవ్‌ అగర్వాల్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy