Take a fresh look at your lifestyle.

ధాన్యం కేంద్రాలపై ఉన్నతాధికారుల చర్యలు అంతంతమాత్రమే

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ ‌రావు చెబుతున్నా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు మాత్రం పేరుకు టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారే తప్ప ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని దుమ్ముగూడెం పిఏసిఎస్‌ అద్యక్షులు, డిసిఎంఎస్‌ ‌డైరెక్టర్‌ ‌డివిఎస్‌. ‌రాజు అన్నారు. మంగళవారం ఆయన దుమ్ముగూడెం పిఏసిఎస్‌ ‌లో పాలకవర్గ డైరెక్టర్లతో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పిఏసిఎస్‌ ‌ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం వలన రైతు దళారుల చేతిలో మోస పోకుండా న్యాయం జరుగుతుందన్నారు. రైతులకు సేవా చేయాలన్నదే తన ఎకైక లక్ష్యం అన్నారు. తాను గతంలో దుమ్ముగూడెం పిఏసిఎస్‌ అద్యక్షుడిగా కొనసాగిన అనుభవం సైతం ఉందన్నారు. గత వారం రోజుల క్రితం కె. లక్ష్మీపురం దాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ ‌గారు పరీశీలించిన సమయంలో ఓ రైతుకు చెందిన దాన్యం రాశి 9 శాతం మాత్రమే తేమ ఉందని దీని వలన రైతులు నష్ట పోతారని అనడం వాస్తవమేనని ఆయన అన్నారు. ఆయన నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చైర్మన్లు క్షేత్ర స్థాయిలో దాన్యం కేంద్రాలను పరీశీలించాలనే సమాచారం మేరకు తాను అక్కడి వెళ్లానన్నారు. రైతుల ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తేమ శాతాన్ని పరీశీలించి, కాటాలు వేయడంతో పాటు గోదాముల్లో భద్రపరిచామన్నారు. ఇప్పటి వరకు హెచ్‌ఎమ్‌టి, 1010 దాన్యాన్ని మిల్లర్ల వద్దకు పంపగా వారు కొర్రీలు పెడుతూనే మూడు లోడులు తీసుకుని •క లోడును వారం రోజుల పాటు ఉంచుకుని తాలు పేరుతో తిప్పి పంపేశారన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు పోయినా సమస్య పరిష్కారం కాలేదన్నారు.

దీంతో లారీ యజమాని కిరాయితో పాటు వెయిటేజ్‌ ‌చార్జీలు సుమారు 70 వేల రూపాయలు చెల్లించాల్సి వచ్చిందన్నారు. ఈ నష్టాన్ని రైతుల మీద వేయాలా, లేక సంఘం భరించాలా అని అధికారులకు సూటి ప్రశ్న వేశారు. మిల్లర్లు సైతం తీసుకు పోయిన దాన్యం లోడ్లు పరీశీలించి తాలు, కటింగ్‌ ‌ల పేరుతో బేరాలు ఆడుతున్నారన్నారు. మిల్లర్లకు సరైన నిర్దేశం చేయక పోవడం వల్లనే వారు అలా వ్యవహరిస్తున్నారన్నారు. అధికారులు సైతం ప్రభుత్వ పాలసీని అమలు చేస్తున్నామని చెబుతున్న టికి క్షేత్ర స్థాయిలో అవి అమలు జరగడం లేదన్నారు. అధికారులు చేసే తప్పిదాలను రైతులు, సంఘం మీద నేపం వేయడం సరికాదన్నారు. అధికారుల తీరు ఇలా ఉంటే భవిష్యత్‌ ‌లో సంఘం ద్వారా దాన్యం కొనుగోలు చేయడం సాద్యం కాదన్నారు. రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టు బాటు ధర అందించాలన్నదే తన లక్ష్యమన్నారు. విలేకరుల సమావేశంలో డైరెక్టర్లు ••ల్లి సూర్యచందర్‌రావు, యలమంచి శ్రీనుబాబు, ••ల్లి చిన్నవెంకటేశ్వర్లు, సిఇఓ ముత్తయ్య తదితరులు ప్గాన్నారు.

Leave a Reply