Take a fresh look at your lifestyle.

దేశంలో కొత్తగా 43,509 కొరోనా కేసులు..640 మంది మృతి

కేరళలో కొత్తగా 22 వేల కేసులు నమోదు..వారాంతపు లాక్‌డౌన్‌ ‌విధింపు
దేశంలో కొరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజు 43 వేలకుపైగా పాజిటివ్‌ ‌నమోదయ్యాయి. 24 గంటల్లో కొత్తగా 43,509 కొవిడ్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. 24 గంటల్లో 38,465 మంది బాధితులు కోలుకున్నారు. మరో వైపు మరణాలు కాస్త పెరిగాయి. 640 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. వైరస్‌ ‌నుంచి ఇప్పటి వరకు 3,07,01,612 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు మొత్తం 4,22,662 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,03,840 యాక్టివ్‌ ‌కేసులున్నాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ ‌కేసులు 1.28 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.38శాతానికి చేరిందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో వీక్లీ పాజిటివిటీ రేటు 2.38 శాతానికి చేరగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 2.52 శాతంగా ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 46.26కోట్ల కోవిడ్‌ ‌శాంపిల్స్ ‌పరీక్షించగా..టీకా డ్రైవ్‌లో భాగంగా 45.07కోట్ల మోతాదులు పంపిణీ చేసినట్లు వివరించింది.

కేరళలో కొత్తగా 22 వేల కేసులు నమోదు..వారాంతపు లాక్‌డౌన్‌ ‌విధింపు
కేరళలో మరోసారి కొరోనా విజృంభిస్తుంది. కేరళలో బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 22 వేల 56 మంది కొత్తగా కొరోనా బారిన పడ్డారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 33 లక్షల 27 వేలు దాటింది. ఇక మరణాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. కేరళలో కొరోనా కారణంగా 131 మంది చనిపోయారు. కేసుల పెరుగుదలతో అప్రమత్తమైన కేరళ సర్కార్‌…..‌వొచ్చే శని, ఆదివారాలు పూర్తి లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన బృందాన్ని కేరళకు పంపిస్తుందన్నారు కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ ‌మాండవ్య. ఈ టీంకు నేషనల్‌ ‌సెంటర్‌ ఆఫ్‌ ‌డిసీజ్‌ ‌కంట్రోల్‌ ‌డైరెక్టర్‌ ‌నేతృత్వం వహించనున్నారు.

మలప్పురం, త్రిస్సూర్‌, ‌కోజికోడ్‌, ఎర్నాకుళం, పాలక్కడ్‌, ‌కొల్లాం, అలప్పుజా, కన్నూర్‌, ‌తిరువనంతపురం, కొట్టాయం జిల్లాల్లో వైరస్‌ ‌తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 4 లక్షల 46 వేల మంది వివిధ జిల్లాల్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. కేరళలో కొరోనా కంట్రోల్‌ ‌కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ టీం సహకారం అందించనుంది. కేరళ సర్కార్‌కు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ ‌భూషణ్‌ ‌లేఖ రాశారు. ఇటీవల సూపర్‌ ‌స్ప్రైడర్‌ ఈవెంట్స్ ‌కు అనుమతి ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. కోవిడ్‌ ‌నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని లేఖలో స్పష్టం చేశారు. కేరళలో గడిచిన 6 వారాలుగా 10 నుంచి 12 శాతం రికార్డవుతోంది. నిత్యం 10 నుంచి 15 వేల మందిలో వైరస్‌ ‌బయటపడుతుంది. హాస్పిటల్‌లో చేరికలు మాత్రం కాస్త తగ్గాయి. రాష్ట్రంలో భారీ స్థాయిలో కోవిడ్‌ ‌నిర్దారణ పరీక్షలు జరుపుతుండటంతోనే పాజిటివ్‌ ‌కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ సర్కార్‌ అ‌ప్రమత్తం అవుతుంది.. గత వారం వీకెండ్‌లో రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేసిన ప్రభుత్వం.. ఈ వారంలో కూడా పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ ‌ప్రకటించింది.

Leave a Reply