ప్రస్థుతం ప్రపంచ దేశాలను వనికిస్తున్న కరోనా మహమ్మారీని తరిమి కోట్టాలంటే కేవల ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటిస్తు, గృహ నిర్భందంలోనే ఉండాలని ములుగు ఎమ్మేల్యే, కాంగ్రేస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి దనసరి సీతక్క అన్నారు. మంగళవారం ములుగు మండలంలోని పోట్లాపూర్ గ్రామంలోని 150 మంది నిరుపేదల కుటుంబాలకు,పత్లిపల్లి గ్రామం మర్రివాడ ఎస్‌సీ కాలనీకి చెందిన 80 మంది కుటుంబాలకు,చింతకుంట గ్రామానికి చెందిన 80 మంది కుటుంబాలకు,కోడిశెల కుంట గ్రామానికి చెందిన 26 నిరుపేద కుటుంబాల వారికి,చిన్నగుంటూరుపల్లి ఎస్‌టి కాలనీకి చెందిన వారికి, సీతక్క స్వగ్రామం జగ్గన్నపేట గ్రామంలోని 250 మంది నిరుపేదలకు ఒక్కోక్కరికి 5 కేజీల బియ్యం, నిత్యావసరాలైన కూరగాయలు,పప్పులు దాతలైన వెంకటాపూర్ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన నడిపెల్లి రాంచందర్‌రావు, సంతోష్,తీగల వీరన్న, దేవగిరిపట్నం గ్రామానికి చెందిన ఉత్తేజ్,ప్రభు,లక్ష్మన్,శి
ఈసందర్బంగా సీతక్క మాట్లాడుతూ లాక్‌డౌన్ సమయంలో పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం ఊరు ఊరు తిరుగుతూ నాకు తోచిన విధంగా సహయం చేస్తుంటే ఓర్వలేని అధికార పార్టీకి చెందిన నాయకులు విమర్శలు చేయడం ప్రజల గమనిస్తున్నారన్నారు. వారికి ప్రజలే బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారన్నారు. కష్టకాలంలో ఉన్న వారికి అండగా నిలబటం పార్టీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని, విమర్శించడం మొదలు పెట్టారని మండి పడ్డారు. గ్రామాలకు ప్రజాప్రతినిధిగా గెలుపోంది నీవు ప్రజలకు చేసింది ఏంటని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే తనను విమర్శించే స్థాయి మీకు లేదని సీతక్క అన్నారు. ప్రజలందరు లాక్‌డౌన్ సమయంలో మరి కోన్ని రోజులు స్వీయ గృహ నిర్భందాన్ని పాటించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ జిల్లా ఆద్యక్షులు నల్లేల కుమారస్వామి, మండల అద్యక్షులు ఎండి చాంద్ పాషా, పిఏసిఎస్ చైర్మెన్ బోక్క సత్తిరెడ్డి, కన్నాయిగూడెం జడ్పీటిసి కరం చంద్ గాంధీ, కో ఆప్షన్ సభ్యులు ఎండి అప్సర్ పాషా, వైస్ చైర్మెన్ మర్రి రాజు, యూత్ అద్యక్షులు బానోత్ రవిచందర్, గ్రామ కమిటి అద్యక్షులు దారావత్ సారయ్య, మాజీ ఎంపిటిసి కంబాల రవి, మహిళా అద్యక్షురాలు పల్లే రజిత,ఎంపిటిసి మాపురపు తిరుపతిరెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్,అజ్జు, లింగయ్య, జర్పుల లాలు, పోరిక భద్రు,మంగ్యా తదితరులు పాల్గోన్నారు.