ప్రజాతంత్ర దినపత్రిక ఫోటో జర్నలిస్టు బి.శ్రీనివాస్ తన సేవాబావాన్ని చాటుకున్నాడు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీ, హన్మకొండ పబ్లిక్ గార్డెన్ పరిసర ప్రాంతాలలోని వలస కార్మికులకు శ్రీనివాస్ తన స్వంత ఖర్చులతో ఫ్రూట్ జ్యూస్, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణి చేశారు. కార్మికుల పిల్లలు ఎండలో ఉండడాన్ని చూసి ఆయన జ్యూస్ ప్యాకెట్స్‌ను అందజేశారు. కాగా శ్రీనివాస్‌ను పలువురు అభినందించారు.