మండంలోని వెలిదండ గ్రామంలో 32 మంది వలస కూలీలను అధికారులు హోం క్వారంటైన్‌లో •ఉంచారు. వీరంతా రెండు నెలల క్రితం మిరపకాయల కూలీ కోసం కృష్ణా, గుంటూరు జిల్లాలకు వెళ్లారు. అయితే వీరు పనుల కోసం వెళ్లిన తర్వాత లాక్‌డౌన్ విధించడంతో స్వగ్రామమైన వెలిదండ రాలేకపోయారు. దీంతో సోమవారం ఎనిమిది మంది వెలిదండ చేరుకోగా మంగళవారం మరో 24 మంది గ్రామానికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే గరిడేపల్లి ఎస్‌ఐ వెంకన్న.
తహశీల్దార్ చంద్రశేఖర్, వైద్యాధికారి రమ్య హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి వచ్చిన వారందరినీ గుర్తించి వారందరికీ హోమ్‌క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు రావొద్దని, వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందిస్తామని అధికారులు తెలిపారు. మరో 20 మంది దాకా వచ్చే అవకాశం ఉందని సమాచారం. •ంక్వా రంటైన్‌లోనున్న వారెవరైనా బయటికి వచ్చినట్లయితే వెంటనే వారిని సూర్యాపేటకి తరలించడం జరుగుతుందని అధికారులు హెచ్చరించారు.