Take a fresh look at your lifestyle.

దేశంలో 24 గంటల్లో కొత్తగా 41,649 కోవిడ్‌ ‌కేసులు 593 మంది మృతి

దేశంలో 24 గంటల్లో కొత్తగా 41,649 కొవిడ్‌ ‌కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. మరో 37,291 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ ‌బారినపడి మరో 593 మంది బాధితులు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో 4,08,920 యాక్టివ్‌ ‌కేసులున్నాయని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 3,16,13,993కు పెరిగింది. ఇందులో 3,07,81,263 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌బారినపడి మొత్తం 4,23,810 మంది మృతి చెందారు. టీకా డ్రైవ్‌లో భాగంగా 46,15,18,479 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ ‌కేసులు 1.29శాతం ఉన్నాయని, ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 2.42శాతం ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు దేశంలో 46.64 కోట్ల కోవిడ్‌ ‌శాంపిల్స్ ‌పరీక్షించినట్లు వివరించింది.

Leave a Reply