తెలంగాణలో కొత్తగా 41 కరోనా కేసులు
- హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లురాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 26 కేసులు జీహెచ్ఎంసీపరిధిలో నమోదయ్యాయ. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య1592కి పెరిగింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 1002 మంది డిశ్చార్జి కాగా 34 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 556 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య లక్ష దాటిందని సమాచారం.