Take a fresh look at your lifestyle.

ఖాళీగా ఉన్న 40వేల టీచర్‌ ‌పోస్టులను వెంటనే భర్తీ చేయాలి

40 thousand vacant, teacher posts, filled immediately,himmatnagar.jgp
:జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. ‌కృష్ణయ్య

కార్పొరేట్‌ ‌శక్తులు విద్యను మద్యంలా అమ్ముతున్నాయి
12వేల స్కూళ్ల మూసివేతను విరమించుకోవాలి

హిమాయత్‌ ‌నగర్‌ : ‌టీచర్‌ ‌పోస్టులను భర్తీ చేయాలంటూ సైఫాబాద్‌ ‌లోని స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ‌ను తెలంగాణ నిరుద్యోగ జెఎసి ముట్టడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 40 వేల టీచర్‌ ‌పోస్టుల నియామకాలను చేపట్టాలంటూ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ ‌నీల వెంకటేష్‌, ‌బిసి సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ముట్టడినుద్దేశించి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. ‌కృష్ణయ్య మాట్లాడుతూ కార్పొరేట్‌ ‌శక్తులు తెలంగాణలో విద్యను మద్యంలా అమ్ముతున్నారని తీవ్రంగా విమర్శించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేరనే సాకుతో ప్రభుత్వం 12 వేల పాఠశాలలు మూసివేయాలనే ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. రాజ్యాంగపరంగా విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించాల్సిన ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచకుండా ప్రైవేట్‌ ‌పరం చేసి పేదలు విజ్ఞానవంతులు కాకుండా కుట్ర చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. కొఠారీ కమిషన్‌ ‌సూచనలు అమలు చేసి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని లేనిచో అందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్షణమే నోటిఫికేషన్‌ ‌విడుదల చేసి ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ ముట్టడి కొంత ఉద్రిక్తతొ పాటు ట్రాఫిక్‌ అం‌తరాయంనికి దారితీసింది. ఈ ముట్టడిలో కోల జనార్దన్‌, ‌జిల్ల పల్లి అంజి, వేముల రామకృష్ణ, మల్లేష్‌ ‌యాదవ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Tags: 40 thousand vacant, teacher posts, filled immediately,himmatnagar

Leave a Reply