Take a fresh look at your lifestyle.

40 కోట్ల భారతీయులు పేదరికం లోకి..! ప్రమాదం పొంచిఉంది…: ఐఎల్ఓ నివేదిక

400 మిలియన్ల మంది భారతీయులు పేదరికంలో మునిగిపోయే ప్రమాదం ఉంది UN నివేదిక. COVID-19 ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వివరిస్తూ UN కార్మిక సంస్థ ప్రచురించిన నివేదిక ప్రకారం కరోనా వైరస్ సంక్షోభం ఇప్పటికే పదిలక్షల అసంఘిటిత  రంగ కార్మికులను ప్రభావితం చేస్తోందని 2 బిలియన్ల మంది ప్రజలను ప్రమాదంలో పడేస్తుందని వెల్లడించింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఆ స్థాయి ప్రపంచ సంక్షోభం ప్రస్తుతం చూస్తున్నామని ప్రస్తుత ఆర్ధిక.. కరోనా.. ఫలితంగా, అసంఘిటిత రంగంలో పనిచేస్తున్న సుమారు 400 మిలియన్ల  భారతీయులు పేదరికంలోకి పీక లోతుగా జారిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్‌ఓ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 2020 రెండవ త్రైమాసికంలో 195 మిలియన్ల పూర్తి కాల ఉద్యోగాలపై 6.7 శాతం ప్రభావం కరోనావైరస్ మహమ్మారి చూపనుంది అని ఈ నివేదిక తెలిపింది. COVID-19 ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వివరిస్తూ ఐక్యరాజ్యసమితి కార్మిక సంస్థ ప్రచురించిన నివేదికలో ఈ వివరాలు వున్నాయి. ఈ సంక్షోభం ఇప్పటికే పదిలక్షల అసంఘిటిత రంగ కార్మికులను ప్రభావితం చేస్తోందని  సుమారు 2 బిలియన్ల మంది ప్రజలను ప్రమాదంలో పడేయనున్నదని ఐల్ఓ వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఈ ధోరణి ఎక్కువగా ఎక్కువగా కనిపిస్తుంది అని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్‌ఓ తెలిపింది. భారతదేశంలో, అసంఘిటిత ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తున్న వారు దాదాపు 90 శాతం.   COVID-19 తర్వాత భారత్ విధించిన లాక్ లాక్ డౌన్ చర్యలు కార్మికులను గణనీయంగా ప్రభావితం చేశాయి. కార్మికులలో చాలామంది గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వెళ్లాల్సిన బలవంత పరిస్థితి గురించి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కూడా తన నివేదికలో కార్మికుల పరిస్థితి గురించి వివరంగా పేర్కొంది.

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా 1.25 బిలియన్ల అసంఘిటిత కార్మికుల ఉద్యోగాలు తొలగింపు వలన తీవ్రమైన వినాశకరమైన ప్రమాదం ఉంది అని అంతర్జాతీయ సంస్థల రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ నివేదికలలో కార్మికులు ఆకస్మిక ఆదాయాలు కోల్పోవడం వలన చోటు చేసుకోనున్న తీవ్ర పరిణామాలను తెలుపుతున్నాయి.

Leave a Reply