Take a fresh look at your lifestyle.

సిద్ధిపేట టు ఇల్లంతకుంట వరకు 4లేన్ల రహదారి

  • నిర్మాణానికి రూ.254కోట్లు మంజూరు
  • ప్రయాణానికి తీరనున్న ఇక్కట్లు
  • నెరవేరిన మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే రసమయి విన్నపం
  • సిఎం కేసీఆర్‌ అం‌గీకారం
  • హర్షం వ్యక్తం చేస్తున్న రెండు నియోజకవర్గాల ప్రజలు

సిద్ధిపేట జిల్లా కేంద్రం నుండి రాజన్న-సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండల కేంద్రం వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి రూ.254 కోట్లు మంజూరైనట్లు మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గత ఏడాది డిసెంబర్‌లో సీఎం కేసీఆర్‌ ‌సిద్దిపేట పర్యటన సందర్భంగా సిద్దిపేట ప్రాంతంలో రంగనాయకసాగర్‌, ‌సిరిసిల్ల జిల్లాలోని అనంతగిరి రిజర్వాయర్లు ఉన్నాయని రాబోయే రోజుల్లో గొప్ప పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి జరుగనున్నాయని సిద్దిపేట నుండి ఇల్లంతకుంట వరకు నాలుగు వరుసలు రహదారి కావాలని కోరడం జరిగిందని వెంటనే మంజూరు చేసిన సిఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ నాలుగు వరసల రహదారి నిర్మాణం జరిగితే సిద్దిపేట, మానకొండూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల ప్రయాణానికి సులభతరం కానుందన్నారు.

ఈ మార్గాన్ని వెడల్పు చేయడం వల్ల సిద్దిపేట పట్టణం నుండి ఈ మార్గంలోని గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగు పడి, సిద్దిపేట పట్ణంలోని వైద్యశాలకు, విద్యాసంస్థలకు, వ్యవసాయ మార్కెట్లలాంటి నిత్యం పనులుండే ప్రదేశాలకు రాకపోకలు సాగించడం చాలా సులువు అవడమే కాకుండా, సమయం కూడా తగ్గుతుందన్నారు. అంతేకాకుండా, రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయనీ, రైతులకు, విద్యార్థులకు కూడా రోడ్డు మీద ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. సిద్దిపేట పట్టణంలోని ఎల్లమ్మ టెంపుల్‌ ‌నుండి పెద్దకోడూర్‌, ‌చిన్నకోడూరు మండలంలోని చిన్నకోడూర్‌ ‌మండల కేంద్రం, సలేంద్రి, కమ్మర్లపల్లి, మైలారం, అల్లీపూర్‌, ‌కిష్టాపూర్‌ ‌జంక్షన్‌ ‌మీదుగా సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం కేంద్రం వరకు 32 కిలోమీటర్లు ఈ రహదారి నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు.

హర్షం వ్యక్తం చేస్తున్న రెండు నియోజకవర్గాల ప్రజలు
భవిష్యత్‌ ‌చూపు దృష్ట్యా …రహదారి నిర్మాణం చేపట్టాలని మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేట పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు సిద్దిపేట నుండి సిద్దిపేట ప్రాంతంలో కొంతభాగం కలిసే అనంతగిరి రిజర్వాయర్‌ ‌వరకు నాలుగు వరుసలు రోడ్డు కావాలని విన్నవించారు. అదేవిధంగా సిద్దిపేట ఇల్లంతకుంటకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి అని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ‌కోరారు. అందుకు సీఎం కేసీఆర్‌ అం‌గీకరించారు. మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే రసమయి విన్నపాలతో నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రాబోయే రోజుల్లో గొప్ప పర్యాటక ప్రాంతంగా రంగనాయకసాగర్‌ ‌కాబోతుందని పర్యాటకుల రద్ధి పెరిగే అవకాశం ఉన్నందున ఈ నాలుగు వరుసల మార్గం ప్రజల ప్రయాణం సులువు కానుంది.

32 కిలో మీటర్ల మార్గం, పట్టణ కేంద్రంలోని ఒక గ్రామం, చిన్నకోడూర్‌ ‌మండలంలోని 6 గ్రామాలను అనుసంధానం చేస్తూ.. అదేవిధంగా సిద్దిపేట రూరల్‌ ‌మండలంలోని బుస్సాపూర్‌, ‌నంగునూర్‌ ‌మండలంలోని తిమ్మాయిపల్లి రింగ్‌ ‌రోడ్డుకు అనుసంధానం కావడం, అదేవిధంగా చిన్నకోడూర్‌ ‌మండలం కిష్టాపూర్‌ ‌జంక్షన్‌ ‌వద్ద బెజ్జంకి మండల కేంద్రంకు అనుసంధానం, ఇల్లంతకుంట వరకు జరిగే ఈ మార్గం ఇల్లంతకుంట నుండి కరీంనగర్‌, ‌సిరిసిల్లకు కూడా అనుసంధానం అవుతుంది. ఈ సందర్భంగా రెండు నియోజకవర్గ ప్రజలకు ప్రయాణానికి మేలు జరగనుంది. ఒక వరుస రహదారి నుండి నాలుగు వరుసల రహదారి నిర్మాణం కావడం పట్ల ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply