Take a fresh look at your lifestyle.

24 ‌గంటల్లో నమోదైన పాజిటివ్‌ ‌కేసులు 3900

  • పెళ్లి వేడుకకు 50.. అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి
  • కొత్త మార్గదర్శకాలు వెల్లడించిన కేంద్రం
  • ఇండో టిబెటన్‌ ‌బార్డర్‌ ‌సిబ్బంది 45మందికి పాజిటివ్‌

‌కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పెళ్లిళ్లు,చావులకు పరిమిత సంఖ్యలో మాత్రమే హాజరయ్యేలా కొత్తగా మార్గదర్శకాలను వెల్లడించింది. గడచిన 24 గంటల్లో భారత్‌లో 3900 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ‌వెల్లడించారు. 24 గంటల్లో ఇంత ఎక్కువ సంఖ్యలో పాజిటివ్‌ ‌కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. అంతేకాదు, కరోనా మరణాల సంఖ్య కూడా భారత్‌లో భారీగా పెరిగింది. 24 గంటల్లో భారత్‌లో కరోనా బారిన పడి 195 మంది మరణించినట్లు లవ్‌ అగర్వాల్‌ ‌ప్రకటించారు. దీంతో.. భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 1,568కి చేరింది. గడచిన 24 గంటల్లో 1,020 మంది కరోనా నుంచి కోలుకున్నారని, రికవరీ రేటు 27.41శాతంగా ఉన్నట్లు లవ్‌ అగర్వాల్‌ ‌వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి భారత్‌లో ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 46,433కు చేరింది. భారత్‌లో కరోనా ప్రభావానికి సంబంధించి రోజువారీ హెల్త్ ‌బులిటెన్‌ను కేంద్ర వైద్యఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఇదిలా ఉంటే, కేంద్ర •ం శాఖ లాక్‌డౌన్‌ అమలవుతున్న ఈ సందర్భంలో తాజాగా కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది. పెళ్లి వేడుకకు 50 మంది మాత్రమే హాజరు కావాలని, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరు కావాలని కేంద్ర •ం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య శైల శ్రీవాత్సవ కేంద్రం మార్గదర్శకాలను ప్రకటించారు. ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న కార్యాలయాల్లో సిబ్బందికి థర్మల్‌ ‌స్క్రీనింగ్‌ను తప్పనిసరి చేసినట్లు ఆమె తెలిపారు. అంతేకాదు, ఫేస్‌ ‌మాస్క్‌లను, శానిటైజర్లను సిబ్బందికి సరిపడా అందించాల్సిన బాధ్యత ఇంఛార్జ్‌లదేనని కేంద్రం స్పష్టం చేసింది.

కార్యాలయాల్లో కూడా భౌతిక దూరాన్ని పాటించాలని, ప్రతి ఒక్క ఉద్యోగి తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌ను వినియోగించాలని కేంద్ర •ం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య శైల శ్రీవాత్సవ స్పష్టం చేశారు. మరోవైపు భారత్‌లో కరోనా వైరస్‌ ‌వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో ఒకే రోజు ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 46,433కు పెరిగింది. కరోనా వల్ల ఇప్పటి వరకు 1,568 చనిపోయారు. ఒకే రోజు భారీ సంఖ్యలో పాజిటివ్‌ ‌కేసులు, మరణాలు నమోదవడం ఇదే ప్రథమమని ఆరోగ్యశాఖ జాయింట్‌ ‌సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ ‌తెలిపారు. అయితే దేశంలో కరోనా వైరస్‌ ‌బారినపడి కోలుకున్న వారి శాతం 27.41 పెరిగిందని లవ్‌ అగర్వాల్‌ ‌చెప్పారు. ఇదిలావుంటే ఇండో-టిబెటన్‌ ‌బోర్డర్‌ ‌పోలీస్‌ ‌సిబ్బందికి కరోనా పాజిటివ్‌ ‌వచ్చింది. ఐటీబీపీ సిబ్బందిలో 45 మందికి కరోనా పాజిటివ్‌ ‌వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. ఢిల్లీలో అంతర్గత భద్రతా విధులు నిర్వహిస్తున్న 43 మందికీ, లా అండ్‌ ఆర్డర్‌ ‌విధుల్లో ఉన్న వారిలో ఇద్దరికీ కరోనా వైరస్‌ ‌సోకినట్లు డాక్టర్లు తెలియచేశారు. వీరందరినీ క్వారంటైన్‌ ‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందకుండా ఢిల్లీ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది.

ఢిల్లీలోని ఆర్మీ ఆర్‌ఆర్‌ ఆస్పత్రిలో 24 కరోనా వైరస్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు నమోదైనట్లుఅధికారులు తెలిపారు. ఆర్మీ ఆర్‌ఆర్‌ ఆస్పత్రిలోని ఆంకాలజీ వార్డ్ ‌నుంచి 24 కోవిడ్‌-19 ‌పాజిటివ్‌ ‌కేసులు వచ్చిన వైద్యులు పేర్కొన్నారు. ఇకపోతే పశ్చిమబెంగాల్‌లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడంలేదు. రోజురోజుకు పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 85 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. దీంతో బెంగాల్లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1344కు చేరింది. మరోవైపు మరణాలు కూడా రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. మంగళవారం కొత్తగా మరో ఏడుగురు కరోనా బారినపడి మృతిచెందడంతో మొత్తం మరణాల సంఖ్య 68కి పెరిగింది. ఇక మొత్తం కేసులలో నుంచి 68 మంది మృతులను, వైరస్‌ ‌బారినుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయిన వారిని తీసివేయగా మరో 940 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయని పశ్చిమబెంగాల్‌ •ం‌శాఖ కార్యదర్శి అలపన్‌ ‌బంధోపాధ్యాయ తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply