Take a fresh look at your lifestyle.

తటస్థంగా పాజిటివ్ కేసులు

3762 మంది కొరోనా బాధితులు 
మరో 20 మంది చనిపోయినట్లు నిర్ధారణ
హైదరాబాద్ ,మే 26: రాష్ట్రంలో . లాక్‌ ‌డౌన్‌ ఆం‌క్షలు అమలు నేపథ్యంలో కొరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గుతున్నాయనుకుంటున్న క్రమంలో  పాజిటివ్ కేసులు సంఖ్య తటస్థంగా కొనసాగుతున్నాయి.. సోమవారం 3043 , ..మంగళ వారం  3 వేల 821 కేసులు నమోదు కాగా బుధవారం 3762 పాజిటివ్ కేసులు నమోదు  అయినట్లు మీడియా బులెటిన్ లో పేర్కొన్నారు. గడచిన 24 గంటల్లో 20  మంది కొరోనా నుంచి కోలుకోలేక కన్నుమూశారు..అందులో ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 మంది మృత్యువాత  పడ్డారు.. మొత్తం 91 వేల 048 మందికి కొరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా 3 వేల 762 మందికి కొరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 816మంది కొరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా హాస్పిల్స్ ‌నుండి డిశ్చార్జ్ ‌కాగా 20మంది కొరోనా నుంచి కోలుకోలేక కన్నుమూశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38వేల 632 కేసులు యాక్టివ్‌ ‌గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొరోనా మరణాల రేటు 1.1 శాతం ఉండగా తెలంగాణలో 0.56 శాతం నమోదు అయింది. అలాగే కొరోనా నుంచి కోలుకున్న వారి శాతం దేశ వ్యాప్తంగా 89.6 శాతం ఉండగా  తెలంగాణలో 92.58 శాతం నమోదు అయినట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి.

Leave a Reply