Take a fresh look at your lifestyle.

37 సం వ్యక్తికి 12 ఏళ్ళ చిన్నారి తో వివాహం..!

అభం శుభం తెలియని 12 ఏండ్ల చిన్నారిని 37సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తితో గుట్టు చప్పుడు కాకుండా వివాహం చేశారు. ఓ వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాల్య వివాహాలను నివారించేందుకు సంబంధిత అధికారులతో గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న కొందరు ముర్ఖత్వం తో చిన్నారులకు బాల్య వివాహాలు జరిపిస్తున్నారు .రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఫరూక్ నగర్ మండలంలోని అయ్యవారిపల్లి గ్రామములో ఓతల్లి ఓచిన్నారిని బలి పశువును చేస్తూ ఈ నెల 15వ తేదీన వివాహం జరిపించింది .విషయం ఈ నోటా ఆ నోటా ఐసిడిఎస్ అధికారులకు తెలియడంతో ఘటన వెలుగులోకి వచ్చింది ..

37 year old married to a 12 year old child
వివాహం చేసుకున్న మల్లేష్

దీంతో ఫరూక్ నగర్ తహసిల్దార్ కార్యాలయానికి పెళ్లి చేసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ చేసారు.వివాహం చేసుకున్న మల్లేష్ అనే వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.చిన్నారిని పెళ్లి చేసుకున్న మల్లేష్ అనే వ్యక్తికి ఇప్పటికే వివాహం అయింది .అతనికి ఇద్దరు మగ పిల్లలు కూడా ఉన్నారు. చిన్నారిని హైదరబాద్ చైల్డ్ వెల్పేర్ కు పంపించారు. అధికారులు పెళ్లి చేసుకున్న వ్యక్తితో పాటు సహకరించినా వారిపై అధికారులు కేసులు నమోదు చెయ్యాలని నిర్ణయించారు..

Leave a Reply