Take a fresh look at your lifestyle.

దేశ ప్రజలపై 36 లక్షల కోట్ల పెట్రో భారం

  • 40 రూపాయల పెట్రోల్‌పై 65 రూపాయల పన్ను
  • మోడీ, కెసిఆర్‌లు కలిసి దోచుకుంటున్నారు
  • ఇందిరాపార్క్ ‌వద్ద ధర్నాలో రేవంత్‌ ‌రెడ్డి
  • ఇంటెలిజెన్స్ ‌చీఫ్‌ ‌ప్రభాకర్‌ ‌రావు తీరుపై మండిపాటు
  • కాంగ్రెస్‌ ‌నేతల ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయని ఆరోపణ
  • భారీగా తరలివొచ్చిన కాంగ్రెస్‌ ‌శ్రేణులు
  • ‘చలో రాజ్‌ ‌భవన్‌’‌కు యత్నం..రేవంత్‌ ‌సహా నాయకుల అరెస్ట్
  • ‌పోలీసుల తీరుపై మండిపాటు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ప్రజలపై 36 లక్షల కోట్ల భారం మోపారని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. ఏడేళ్ల మోడీ, కెసిఆర్‌ ‌పాలనపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. పెరిగిన పెట్రోల్‌, ‌డిజిల్‌ ‌ధరలకు నిరసనగా కాంగ్రెస్‌ ‌చేపట్టిన ఆందోళనను అడ్డుకోవడం ద్వారా కెసిఆర్‌ ‌ప్రభుత్వం మోడీ సర్కార్‌తో కుమ్మక్కయ్యిందని రుజువయిందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం విపరీతంగా పెరిగిన పెట్రో ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌నిరసనలను చేపట్టింది. ఇందిరాపార్క్ ‌వద్ద జరిగిన ఆందోళనలో రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్న దోపిడీదారులని మండిపడ్డారు. ప్రజలు ఈ దోపిడీపై ఎక్కడిక్కడ చర్చ చేపట్టాలన్నారు. ఏడేళ్లలో జరిగిన దోపిడీ అంతాఇంతా కాదన్నారు.

అధికారులు ముఖ్యమంత్రి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తే.. ఎవరినీ వదిలిపెట్టమని, కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని రేవంత్‌ ‌రెడ్డి హెచ్చరించారు. పెట్రో దరలపై తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా ఐజీ ఇంటిలిజెన్స్ ‌ప్రభాకరరావు తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. తాము చేస్తున్న కార్యక్రమం ప్రజల కోసమని చెప్పారు. 40 రూపాయల పెట్రోల్‌కు 65 రూపాయల పన్ను వసూలు చేస్తున్నారని, అలాగే డీజీల్‌, ‌గ్యాస్‌పై అధిక ధరలు వసూలు చేస్తున్నారని రేవంత్‌ ‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజ్‌భవన్‌ ‌ముట్టడికి పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఇచ్చిన  పిలుపుతో కాంగ్రెస్‌ ‌శ్రేణులు ఇందిరా పార్క్ ‌వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో రేవంత్‌ ‌రెడ్డి జూబ్లిహిల్స్‌లోని తన నివాసం నుంచి ఇందిరాపార్క్ ‌దర్నా చౌక్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వి•డియాతో మాట్లాడుతూ మోదీ సూచలనలతోనే కేసీఆర్‌ ‌ప్రభుత్వం కాంగ్రెస్‌ ఆం‌దోళనలను అడ్డుకుంటుందని మండిపడ్డారు.

కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు అధికారులు మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. ఐజీ ప్రభాకరరావు ఖాసిం రిజ్వీ మాదిరి వ్యవహరిస్తున్నారన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఇంటిలిజెన్స్ ఐజీ ప్రభాకరరావుకు పోస్టింగ్‌ ఇచ్చారని ఆయన తెలిపారు. పార్లమెంట్‌ ‌సమావేశాల్లో ఐజీ ప్రభాకరరావుపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కాంగ్రెస్‌, ‌బీజేపీ నేతలు సహా రాష్ట్రంలోని ముఖ్య నాయకుల ఫోన్లను టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం హ్యాక్‌ ‌చేస్తుందని ఆరోపించారు. హ్యాకర్లను ఉపయోగిస్తూ అంతర్జాతీయ నేరానికి పాల్పడుతోన్న కేసీఆర్‌ ‌భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. డీజిల్‌, ‌పెట్రోల్‌, ‌గ్యాస్‌ ‌ధరలు తగ్గించే వరకు కాంగ్రెస్‌ ‌పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌పన్నులను పెంచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కొట్లాడేందుకు తాము వెనకాడబోమని చెప్పారు. కార్యక్రమంలో మాజీ పిసిసి చీఫ్‌ ‌పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీ తదితరులు పాల్గొన్నారు.

రాజ్‌భవన్‌ ‌వెళ్లేందుకు యత్నం..రేవంత్‌ అరెస్ట్, ‌పోలీసుల తీరుపై మండిపాటు
ఇందిరా పార్క్ ‌వద్ద పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ఇందిరా పార్క్ ‌వద్ద జరిగిన సమావేశంలో ప్రసంగించిన రేవంత్‌ ‌రెడ్డి.. కార్యకర్తలతో కలిసి రాజ్‌ ‌భవన్‌ ‌వైపు పాదయాత్రగా బయలుదేరారు. ఇదే సమయంలో పోలీసులు ఆయనను అరెస్ట్ ‌చేసి అక్కడినుంచి తీసుకెళ్లారు. గవర్నర్‌కు వినతిపత్రం సమర్పిస్తామని అన్నా పోలీసులు ఒప్పుకోలేదు. పాదయాత్రకు అనుమతి లేదన్నారు. రేవంత్‌ను అరెస్ట్ ‌చేసే సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు కాంగ్రెస్‌ ‌కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. రేవంత్‌ అరెస్ట్‌ను ఖండిస్తూ కాంగ్రెస్‌ ‌కార్యాకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొందరు రేవంత్‌ ‌తీసుకెళ్తున్న వాహనం వెంట వెళ్లారు.

ఈ నేపథ్యంలోనే పోలీసులు మరికొందరిని అరెస్ట్ ‌చేసి స్టేషన్‌కు తరలించారు. పెట్రోలు, డీజిల్‌ ‌ధరల పెంపునకు నిరసనగా ‘చలో రాజ్‌భవన్‌’‌కు యత్నించిన కాంగ్రెస్‌ ‌శ్రేణుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఇందిరాపార్కు వద్ద ధర్నా ముగిసిన అనంతరం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు కాంగ్రెస్‌ ‌నేతలు, కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్‌ ‌శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో రేవంత్‌ ‌సహా నేతలు, కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్‌ అం‌దుబాటులో లేనందున ఆన్‌లైన్‌లో వినతిపత్రం అందజేయాలని పోలీసులు సూచించారు. అయితే అంబేడ్కర్‌ ‌విగ్రహం వరకు తమ ర్యాలీని అనుమంతించాలని రేవంత్‌రెడ్డి కోరినప్పటికీ పోలీసులు అంగీకరించలేదు. దీంతో పోలీసులు, కాంగ్రెస్‌ ‌శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం రేవంత్‌, ‌మధుయాస్కీ సహా ముఖ్యనేతలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పెట్రోలు, డీజిల్‌ ‌ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణలో చేపడుతోన్న ఆందోళనల్లో భాగంగా ‘చలో రాజ్‌భవన్‌’‌కు వెళ్తున్న నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

దీనిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. తాము శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తామని, ధర్నాచౌక్‌ ‌నుంచి రాజ్‌భవన్‌ ‌వరకు ప్రదర్శనకు అనుమతి ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ ‌చేశారు. ఇలా ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. అరెస్టు చేసిన వారిని పోలీసులు వెంటనే విడిచిపెట్టాలని ఆయన అన్నారు. శాంతియుత నిరసనలను ఇలా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే లక్షలాది మంది రోడ్డుపైకి వొచ్చి ఆందోళన నిర్వహిస్తారని ఆయన హెచ్చరించారు. మరోవైపు ధర్నా చౌక్‌ ‌వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. ధర్నా చౌక్‌ ‌నుంచి రాజ్‌ ‌భవన్‌ ‌కు వెళ్లే రహదారులన్నింటిని పోలీసులు దిగ్భందనం చేశారు. పోలీసులు చర్యలను కాంగ్రెస్‌ ‌పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇందిరా పార్క్ ‌దగ్గర ధర్నా కోసం అనుమతి దరఖాస్తు చేశామని పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి తెలిపారు. ఇలా పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం రాజరిక పాలనకు నిదర్శనమని.. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవరహరిస్తోందని మల్లు రవి ఆరోపించారు. రాజ్‌భవన్‌ ‌వద్ద టెన్షన్‌ ‌వాతావరణం నెలకొంది. అక్కడికి చేరుకున్న కాంగ్రెస్‌ ‌కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Leave a Reply