Take a fresh look at your lifestyle.

బంధువుల్లా వలస కూలీలకు వీడ్కోలు

వలస కూలీలు ఈ రాష్ట్ర ప్రగతిలో భాగమని వారు లాక్‌డౌన్‌ ‌వేల ఒక్కపూట కూడా ఆకలితో ఉండకూడదన్న ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌పిలుపు మేరకు వారిని బిడ్డల్లా చూసుకున్నాంఅని నేడు వారి స్వస్థలాలకు బందువుల్లా సాగనం పుతున్నాం..’’ అని రాష్ట్ర గిరిజన సంక్షేమ, శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ‌తెలిపారు. సోమవా రం జిల్లాలోని తుమ్మల తండా వద్ద ఉన్న మహారాష్ట్ర వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపేందుకు దాతల సహకారంతో ప్రైవేట్‌ ‌స్కూల్‌ ‌వాహనాలు ఏర్పాటు చేసి, వాటికి సొంత ఖర్చుతో డీజిల్‌ ‌పోయించి, ఇంటికెళ్లే వరకు కూడా దారి పొడవునా ఆకలితో ఉండకూడదని భోజన ఏర్పాట్లు చేయించి, వారి వాహనానికి పచ్చజెండా ఊపి సాగనంపారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్‌ ‌బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి కూలీ పనిమీద వచ్చి వలస కూలీలు మన రాష్ట్ర అభివృద్ధిలో భాగమయ్యారని వారు పస్తులందకుండా ముఖ్య మంత్రి 12 కిలోలీ రేషన్‌ ‌బియ్యం, మనిషికి 500 రూపాయల డబ్బులిచ్చి బిడ్డలుగా చూసుకున్నారన్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ సెక్రటరీ తక్కెలపల్లి రవీందర్‌ ‌రావు, టిఆర్‌ఎస్‌ ‌మహబూబాబాద్‌ ‌నేతలు శ్రీరంగారెడ్డి, శ్రీనివాసరెడ్డి, కృష్ణారెడ్డి తదితర నేతలు, అధికా రులు పాల్గొన్నారు. అనంతరం చిన్న గుడూరులో మీడియా ప్రతినిధులకు నిత్యావసర సరుకులను మంత్రి సత్యవతి రాథోడ్‌ ‌పంపిణీ చేశారు.

రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు
కురవి మే 4 (ప్రజాతంత్ర విలేకరి) : ఐకేపీ పిఎసిఎస్‌ ‌ధాన్యం కొనుగోలు సెంటర్లలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్‌ అన్నారు, సోమవారం మండ లంలోని మొదుగులగూడెంలో ఉపాధి కూలీల కు మాస్కులు పంపిణి చేసి గ్రామ సమస్య లు అడిగి తెలుసు కున్నారు, గ్రామస్తులు ఆమె తో మాట్లాడుతూ గ్రామానికి సర్పంచ్‌ ‌లేకపోవడం తో స్పెషల్‌ ఆఫీసర్‌ ‌గా ఎంపీడీఓ దన్‌ ‌సింగ్‌ ‌నాయక్‌ ఇం‌చార్జి గా ఉన్నారు గ్రామంలో పారిశుద్యం సరిగా లేదని , మిషన్‌ ‌భగీరథ ఇంటింటికి నీరు రావడంలేదని గ్రామస్తులు మంత్రి తో మొరపెట్టుకున్నారు, స్పెషల్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు సరిగా నివహిచటంలేదని గ్రామస్తులు ఆమెకు తెలిపారు. గ్రామ శివారు జుజూర్‌ ‌తండాలో తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు ధరావత్తు తిరుపతి తండ్రి ఇటీవల మరణించడంతో వారి కుటుంబా న్ని ఓదార్చి సహాయం అందించారు. అదే తండా లో గత పది సంవత్సరాల నుంచి నివసిస్తున్న భూక్యా కాంతి ఇద్దరు ఆడపిల్లల తో కూలి నాలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించు కుంటుంది, ఆమెకు రేషన్‌ ‌కార్డు లేకపోవడంతో మంత్రితో కి తెలియజేయడంతో వెంటనే విఆర్వోతో రేషన్‌ ‌బియ్యం వచ్చే విధంగా చేయాలని సూచించారు త్వరలో కొత్త రేషన్‌ ‌కార్డు ఇప్పిస్తామని ఆమె తెలిపారు, మండల కేంద్రంలో పిఆర్టియు వారు ఏర్పాటు చేసిన నిత్యవసర వస్తువులను ఆమె నిరుపేదలకు పంపిణీ చేశారు.కార్యక్రమంలో జడ్పిటిసి బండి వెంకటరెడ్డి, డీఎస్పీ నరేష్‌ ‌కుమా ర్‌, ‌జిల్లా నాయకులు ఐలు నరహరి, వీరభద్ర స్వామి ఆలయ మాజీ చైర్మన్‌ ‌బండి లక్ష్మారెడ్డి, అల్లూరి కిషోర్‌ ‌వర్మ, సర్పంచ్‌ ‌బోడ శ్రీను, జాటోత్‌ ‌నెహ్రూ నాయక్‌, ‌కొప్పుల వెంకట్‌ ‌రెడ్డి, బాదె నాగయ్య, ధరావత్‌ ‌ఫుల్‌ ‌సింగ్‌, ‌లచ్చిరాం, తదితరులు పాల్గొన్నారు,

Leave a Reply