Take a fresh look at your lifestyle.

మధ్యాహ్న భోజనం వికటించి 35 మంది విద్యార్థులు అస్వస్థత

35 students sick after lunch break

నాగరకర్నూల్‌: ‌మధ్యాహ్నన భోజనం వికటించి 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా కొత్తపల్లి మండలం చంద్రకల్‌ ‌గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్నది. నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్‌ ‌జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో  గురువారం 35 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం నాగర్‌ ‌కర్నూల్‌ ‌ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను జిల్లా కలెక్టర్‌ ‌శ్రీధర్‌ ‌పరమార్శించారు.

ఈ సందర్భంగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు గల కారణాలను నివేదించాలని డాక్టర్లను ఆదేశించారు. విద్యార్థుల వివరాలను వైద్య అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ విద్యార్థులందరికీ మెరుగైన చికిత్స అందుతుందని సంఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్‌ ‌వెంట డీఈవో గోవిందరాజులు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ‌ప్రభు, ఇతర డాక్టర్లు, విద్యాశాఖ అధికారులు ఉన్నారు.

Tags: nagar kurnool, 35 students, sick after, lunch break, chandrakal district, school

Leave a Reply