Take a fresh look at your lifestyle.

రైతు బజార్ల ద్వారా రూ.35కిలో ఉల్లి మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి వెల్లడి

ఉల్లి ధరల నియంత్రణ కోసం మార్కెటింగ్‌ ‌శాఖ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో రూ. 35కే కిలో ఉల్లిగడ్డలు విక్రయిస్తున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్‌ ‌శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నుంచే రైతుబజార్లలో ఉల్లి విక్రయం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జంట నగరాల్లోని 11 రైతుబజార్లలో ఉల్లిని అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రతి వ్యక్తికి రెండు కిలోల చొప్పున ఉల్లిని విక్రయిస్తామన్నారు. ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఉల్లిని కొనుగోలు చేయొచ్చని తెలిపారు. భారీ వర్షాలకు దేశ వ్యాప్తంగా ఉల్లి పంట దెబ్బతిన్నదని చెప్పారు.

లాభం లేకుండా రవాణా ఖర్చులను దృష్టిలో ఉంచుకుని అమ్మకాలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఉల్లి ధర ఘాటెక్కిస్తోంది. రూ.40 నుంచి మొదలైన ఉల్లి ధర పెంపు రెండు నెలల వ్యవధిలోనే రూ.100కు చేరింది. రైతుబజార్లలో కిలో రూ.75కు విక్రయిస్తుండగా, బయటి మార్కెట్లో మాత్రం వంద రూపాయలు పలుకుతోంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు కర్నూలులోని పంట మొత్తం నాశనమైపోయింది. ఈ తరుణంలో రైతు బజార్లలో తక్కువ రేట్లకే అమ్మేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎలాంటి లాభం లేకుండా రవాణా ఖర్చులు, దెబ్బతిన్న సరుకును దృష్టిలో ఉంచుకుని అమ్మకాలు జరపాలని మార్కెటింగ్‌ అధికారులను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి ఆదేశించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply