Take a fresh look at your lifestyle.

64 ‌మంది ఎమ్మెల్యేలపై 346 కేసులు 10 మంది ఎంపీలపై 133 కేసులు

రాష్ట్ర ప్రజాప్రతినిధులపై కేసుల వివరాలను బయటపెట్టిన ఫోరం ఫర్‌ ‌గుడ్‌ ‌గవర్నెన్స్

ఎన్నికల్లో పోటీచేసే ప్రజాప్రతినిధుల కేసులపై ఎప్పుడూ రిపోర్టును బయటపెట్టే ఫోరం ఫర్‌ ‌గుడ్‌ ‌గవర్నెన్స్ ‌తాజాగా మరోసారి తెలంగాణ నేతల కేసుల చిట్టాను బయటపెట్టింది. రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలైన ప్రజాప్రతినిధులపై మొత్తం 509 కేసులు ఉన్నాయని ఫోరం ఫర్‌ ‌గుడ్‌ ‌గవర్నెన్స్ ‌తాజాగా తెలిపింది. 64 మంది ఎమ్మెల్యేలపై 346 కేసులు ఉన్నాయని.. మరో 10 మంది ఎంపీలపై 133 కేసులు నమోదయ్యాయని ఫోరం ఫర్‌ ‌గుడ్‌ ‌గవర్నెన్స్ ‌వెల్లడించింది. మాజీ ఎమ్మెల్యేలపై 39 కేసులు నమోదైనట్టు తెలిపింది.

రాష్ట్రంలో వీరిపై మొత్తం 509 కేసులు నమోదు కాగా వీటిలో కేవలం 245 కేసులు మాత్రమే ప్రత్యేక కోర్టుల్లోకి బదిలీ అయ్యాయని స్పష్టం చేసింది. 2018 నుంచి 73 కేసుల్లో తీర్పులు వొచ్చినా ఏ ఒక్క ప్రజాప్రతినిధికి శిక్ష పడలేదని తెలిపింది. దీంతో పోలీసులపై అనుమానం వొస్తోందని ఆరోపించింది. తాజాగా ఫోరం ఫర్‌ ‌గుడ్‌ ‌గవర్నెన్స్ ‌గవర్నర్‌ ‌తమిళిసైకి లేఖ రాశారు. సుప్రీమ్‌ ‌కోర్టు నేర చరిత గల ఎమ్మెల్యేలు, ఎంపీలపై సత్వరం విచారణకు ప్రత్యేక కోర్టులు నియమించాలని అన్ని రాష్ట్రాలను కోరినా పోలీసులు, ప్రభుత్వం సహకరించడం లేదని.. ఇంకా ప్రత్యేక న్యాయస్థానాలకు కేసులు బదిలీ చేయడం లేదని లేఖలో కోరారు.

Leave a Reply