భద్రాచలం పట్టణంలో 33, 97 లక్షల విలువగల గంజాయిని పట్టుకు న్నారు.ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం మధ్యాహ్నం భద్రాచలంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద పట్టణ సిఐ స్వామి ఆద్వర్యంలో, ఎస్సై బి.మహేష్ తన సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా ఒక డిసియం నంబర్ జేహెచ్ 09వై0399 గల దానిని ఆపి తనిఖీ చేయగా అందులో ప్రభుత్వ నిషేదిత గంజాయి ఉండటాన్ని గమనించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో డిసియం నందు 226.500 కేజీల గంజాయి లభ్యమైంది.దీని విలువ 33, 97, 500/- రూపాయలు గా ఉండును.
ఇందులో ఉన్న ముద్దాయిలను విచారించగా ఒడిశా రాష్ట్రంలోని మల్కాజ్ గిరి కి చెందిన సుజిత్ గోల్దార్ ,మనోజిత్ రాయ్ అని చెప్పి మల్కాన్ గిరి గ్రామం నుండి విజయవాడ కు తీసుకువెళ్తున్నారని చెప్పడం జరిగింది అని తెలిపారు. భద్రాచలం పట్టణ సరిహద్దులలో 24 గంటలు పోలీస్ తనిఖీలు జరుగుతుంటైయని, నిషేదిత వస్తువులు అయిన గంజాయి మరియు మారేయితర వస్తువులని తరలించిన వారిపై చట్టరీత్య చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ స్వామి, ఎస్సై బి. మహేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.