Take a fresh look at your lifestyle.

కరోనా ఎఫెక్ట్ ఈ ‌నెల 31 వరకు.. విద్యాసంస్థలు, థియేటర్స్, ‌షాపింగ్‌ ‌మాల్స్ ‌మూసివేత

  • కరోనా కట్టడి లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు
  • సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ భేటీ
  • ఇంటర్‌, ‌టెన్త్ ‌పరీక్షలు యధాతo
  • అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు సైతం కుదింపు
  • తక్షణ ముందస్తు చర్యలకు ఆదేశాలు
  • మంత్రివర్గ సమావేశంలోనూ సుదీర్ఘ చర్చ

కరోనా రోజురోజుకూ ఉధృతరూపం దాలుస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమమత్తమైంది. ఈనెల 31 వరకూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, షాపింగ్‌ ‌మాల్స్‌ను మూసివేయాలని నిర్ణయించింది. వైరస్‌ ‌మరింతగా విస్తరిం చకుండా తగిన జాగ్రత్తలు తీసుకో వాలంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన నేపథ్యంలో శనివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శాసనసభ కమిటీ హాలులో ఉన్నత స్థాయి కమిటీ భేటీ అయింది. ఈ బేటీలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌, ‌డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్‌ అం‌జనీ కుమార్‌, ‌జీహెచ్‌ఎం‌సి మేయర్‌, ‌కమిషనర్‌, ‌హైదరాబాద్‌, ‌రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‌కట్టడి లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అలాగే షాపింగ్‌ ‌మాల్స్ ‌మూసేయాలని ఆదేశించింది. విద్యాసంస్థలు మూసినా టెన్త్, ఇం‌టర్‌ ‌పరీక్షలు మాత్రం యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు, థియేటర్లు, షాపింగ్‌ ‌మాల్స్ ‌మూసివేయనున్నారు. అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన అయితే, ఇప్పటికే పదోతరగతి పరీక్షలు ప్రారంభమైనందున షెడ్యూల్‌ ‌ప్రకారం వాటిని నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అలాగే, మరో నాలుగు రోజుల్లో ఇంటర్‌ ‌పరీక్షలు ముగియనున్న నేపథ్యంలో ఆ పరీక్షలను షెడ్యూల్‌ ‌ప్రకారమే నిర్వహించనున్నారు.

మరోవైపు, కరోనా తీవ్రత అసెంబ్లీ సమావేశాలపైనా పడింది. ముందుగా నిర్ణయించిన మేరకు అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు ఈనెల 20 వరకు జరగాల్సి ఉండగా, కరోనా పరిస్థితి తీవ్రత దృష్ట్యా మరో రెండు రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఆది,సోమవారాలు కూడా శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. సోమవారం ద్రవ్యవినిమయ బిల్లును ఆమోదించి శాసనసభను నిరవధికంగా వాయిదా వేయాలని నర్ణయించారు. కాగా తెలంగాణలో ఇప్పటికే రెండు కరోనా కేసులు పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. గాంధీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య కేంద్రాల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. వైరస్‌ ‌లక్షణాలు కనిపించిన వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వం ముందస్తుగా జాగ్రత్తలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల వద్దనే పరీక్షలు నిర్వహిస్తోంది. కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా పలు రాష్టాల్రు సైతం పాఠశాలలు, మాల్స్ ‌మూసివేశారు. తక్షణమే అన్నిజిల్లాల అధికారులను అప్రమత్తం చేయాలని అన్నారు. ప్రత్యేకించి ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని, అవసరమైన భద్రత చర్యలు తీసుకోవలని అన్నారు. ముఖ్యంగా కరోనావైరస్‌ ‌పై అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

  • అంబులెన్సులు సిద్ధం చేస్తున్న ఆరోగ్య శాఖ
  • కరోనా అనుమానితులను తరలించేందుకు వైద్య ఆరోగ్యశాఖ

అంబులెన్స్‌లను సిద్ధం చేస్తోంది. కరోనా అనుమానితులను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి అనంతగిరికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి అంబులెన్స్‌లను అధికారులు రప్పించారు. జిల్లాల నుంచి కోఠి డీఎంఈ కార్యాలయానికి అంబులెన్స్‌లు చేరుకున్నాయి. అవసరమైతే ప్రైవేట్‌ అం‌బులెన్స్‌లు వాడుకోవాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.మరోవైపు కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాల అప్రమత్తవుతోంది. శంషాబాద్‌ ‌విమానాశ్రయంలో ఇక దట ఎవరికైనా అనుమానిత లక్షణాలు గుర్తిస్తే వెంటనే వారిని వికారాబాద్‌ ‌జిల్లా అనంతగిరికి తరలించి అక్కడ చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అక్కడ ప్రత్యేకంగా ఐసోలేషన్‌ ‌కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి అనంతగిరికి 80 కిలోటర్ల దూరం ఉంది.

వైరస్‌ ‌లక్షణాలు ఉన్న వారిని తరలించేందుకు గంటన్నర సమయం పడుతోంది. అక్కడికి చేరుకోగానే వారికి వైద్య సేవలందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా లక్షణాలు ఉన్న వారెవ్వరూ హైదరాబాద్‌కు రాకుండా వారిని బయటే పరీక్షలు నిర్వహించేందుకు అనంతగిరి హరిత రిసార్టస్‌లో ఐసోలేషన్‌ ‌కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.హైదరాబాద్‌లో మరో కరోనా పాజిటివ్‌ ‌కేసుహైదరాబాద్‌ ‌నగరంలో మరో కరోనా వైరస్‌ ‌పాజిటివ్‌ ‌కేసు నమోదైంది. ఇటలీ నుంచి నగరానికి వచ్చిన వ్యక్తికి కోవిడ్‌-19 ‌పాజిటివ్‌గా వచ్చినట్లు ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. అదేవిధంగా ఇటలీ నుంచి వచ్చిన మరో ఇద్దరి వ్యక్తులు కూడా కరోనా వైరస్‌ ‌భారిన పడ్డట్లుగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. ధృవీకరణ కోసం వారి రక్త నమూనాలను పూణెళిలో గల నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌వైరాలజీకి పంపించినట్లు పేర్కొన్నారు. జన సమూహా ప్రదేశాలకు ప్రజలు దూరంగా ఉండాల్సిందిగా అధికారులు మరోమారు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply