Take a fresh look at your lifestyle.

ఉద్యోగుల్లో చిచ్చు పెట్టిన 317 జివో

  • రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా ఉంది
  • రాష్ట్ర రాజకీయాల్లో రోజుకో వీధి భాగోతం నడుస్తుంది
  • బీజేపీ..టీఆర్‌ఎస్‌ ఉమ్మడి డ్రామాలు
  • కెసిఆర్‌, ‌బిజెపి తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌
  • ‌రామానుజ విగ్రహ ప్రారంభోత్సవంపై అభ్యంతరాలు

ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ఉద్యోగుల్లో కొందరిని తన వైపు తిప్పుకునే ఆలోచనలోనే జీఓ 317 వుందని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్న ఉద్యోగుల్లో చీలిక తెచ్చి ఒక వర్గాన్ని అనుకూలంగా మలుచుకున్నారని అన్నారు. ఈ జివోతో ఉద్యోగుల్లో చిచ్చు పెట్టారని అన్నారు. కెసిఆర్‌ ‌రూపొందించిన కొత్త జోనల్‌ ‌వ్యవస్థకి కేంద్రం ఆమోదంతో రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చింది. జీఓ 317తో ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీఓ ఉందన్నారు. స్థానికత కోల్పోకుండా ఉద్యోగ కల్పన ఉండాలి. నాలుగు లక్షల మంది ఉద్యోగులలో చిచ్చు పెట్టారు. తెలంగాణ రాజకీయంలో రోజుకో వీధిబాగోతం నడుస్తుందని ఆయన మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో నటులను ఇక్కడికి తెచ్చి రంజింప చేసే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు.

కాంగ్రెస్‌కి రాజకీయ ప్రయోజనాల కంటే..రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అన్నారు. బండి సంజయ్‌..‌క్యాంప్‌ ఆఫీస్‌ ‌దీక్ష చేస్తారు అంటారు. జాగరణ అంటే.. నైట్‌ ‌క్యాంప్‌ ఆఫీస్‌లో పడుకుని పొద్దుగాల ఇంటికి పోతా అన్నాడు. అదేదో పెద్ద సమస్య అన్నట్టు..రాష్ట్ర ప్రభుత్వం కట్టర్లు..గ్యాస్‌ ‌ప్రయోగించింది. అరెస్ట్ ‌చేసి 48 గంటల్లో సమస్య ముగిసింది. బీజేపీ నేతలు గంగిరెద్దుల వాళ్ళు లెక్క వచ్చిపోతున్నారు. కార్గిల్‌ ‌వీరున్ని ముద్దాడినట్టు సంజయ్‌ ‌ని బీజేపీ ముఖ్యమంత్రులు ముద్దాడుతున్నారు. బీజేపీ వాళ్లకు ఏమైనా బుద్ది ఉందా? రాష్ట్రం పంపిన నివేదిక కు కేంద్రమే ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఉత్తర్వులు ఇప్పించింది మీరే కదా. రాష్ట్రం పంపిన నివేదిక తప్పు అయితే?..కేంద్ర మంత్రి

వర్గం ఎలా ఆమోదం పలికిందన్నారు రేవంత్‌. ‌కెసిఆర్‌ ‌తప్పు చేస్తే దానికి మద్దతు చెప్పింది బీజేపీ. కేంద్ర ఆదేశాలు వెనక్కి తీసుకోవచ్చు కదా. జోనల్‌ ‌విధానం అంతా కేంద్రం చేతిలోనే ఉంది. కేంద్ర మంత్రి వర్గంలో కెసిఆర్‌ ‌నిర్ణయాన్ని గుడ్డిగా ఆమోదం తెలిపిన కిషన్‌ ‌రెడ్డి ఇక్కడ ఇష్టం వొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. బండి..గుండు..ఇద్దరు ఉద్యోగులను మోసం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే జీఓ 317 పై న్యాయం చేయట్లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వొస్తే న్యాయం చేస్తారా..? లెప్ట్ ‌నేతలను కెసిఆర్‌ ఇం‌టికి పిలిచి డ్రామాలు మొదలు పెట్టారు. కెసిఆర్‌ ‌బీజేపీ పంజరంలో చిలుక అన్నారు. బీజేపీ మాటలే కెసిఆర్‌ ‌పలుకుతారు. మోడీ ఆదేశాలతోనే కెసిఆర్‌ ‌మాట్లాడుతున్నారు. బీజేపీ.. టీఆర్‌ఎస్‌ ఉమ్మడి డ్రామాలు ఆడి జనాన్ని మభ్యపెడుతున్నారని రేవంత్‌ ‌విమర్శించారు. చైనాలో తయారైన రామనుజాచార్యుల విగ్రహావిష్కరణకు రావద్దని, అలా వస్తే మీరు దేశద్రోహులే అవుతారని ప్రధాని మోడీని ఉద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. మోడీ ఎజెండాను కేసీఆర్‌ అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

బండి సంజయ్‌, ‌మోడీ దేశభక్తి నేతి బీరకాయలో నేతి అంత అని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు మేక్‌ ఇన్‌ ఇం‌డియా అని గొప్పలు చెబుతారని, గుజరాత్‌లో పెట్టిన సర్దార్‌ ‌పటేల్‌ ‌విగ్రహాన్ని చైనాలో ఎందుకు తయారు చేయించారని ఆయన ప్రశ్నించారు. ముచ్చింతలలో పెట్టబోయే రామానుజాచారి విగ్రహం కూడా చైనాలోనే తయారైందని ఆయన తెలిపారు. చైనాలో తయారైన ఆ విగ్రహ ఆవిష్కరణకు మోడీ ఎలా వొస్తారని ఆయన ప్రశ్నించారు. అటువంటపుడు మీరు ఎలా దేశభక్తులు అవుతారన్నారు. ఇందిరాగాంధీ పేరెత్తే అర్హత అస్సాం సీఎం హేమంత బిశ్వాస్‌కు లేదన్నారు. 317జీవోను కేంద్రం నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. సర్దార్‌ ‌విగ్రహాన్ని చైనా నుంచి తెచ్చిన బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. మీరు దేశభక్తులు అయితే చైనాలో తయారైన రామనుజాచార్యుల విగ్రహావిష్కరణకు రావద్దన్నారు.

Leave a Reply