Take a fresh look at your lifestyle.

రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగానే 317 జీఓ

  • నిరుద్యోగులను మోసం చేయడమే అవుతుంది
  • ఎవరి ద పోరాటం చేస్తున్నారో తెలుసుకోండి: బీజేపీకి హరీష్‌ ‌రావు కౌంటర్‌

‌ప్రజాతంత్ర, మహబూబ్‌నగర్‌, ‌జనవరి18 : తెలంగాణలో బీజేపీ-టీఆర్‌ఎస్‌ ‌నేతల మధ్య హోరాహోరీ మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. మంత్రి హరీష్‌ ‌రావు సందర్భం వచ్చినప్పుడల్లా బీజేపీ నేతల్ని చెడుగుడు ఆడేస్తుంటారు. కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు. 317 జీవో రద్దు అంటే.. నిరుద్యోగులకు ఉద్యోగాలు వద్దు అన్నట్టే అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. జిల్లాల్లో స్థానికులకు ఉద్యోగాలు దక్కుతాయి. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 317 జీఓ వచ్చింది. ఎవరి ద పోరాటం చేస్తున్నారో బీజేపీ నేతలు ఆలోచించుకోవాలన్నారు. ఈ పక్రియ పూర్తి అయితే ఖాళీగా ఉన్న 60, 70 వేల ఉద్యోగాలను నింపాలని ప్రభుత్వం చూస్తోంది. వాళ్ళకి నిరుద్యోగుల ద ప్రేమ లేదు. కేవలం రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. పేదలకు ఉద్యోగాలు రావొద్దని..మాట్లాడుతున్నారు. నిరుద్యోగుల ద ప్రేమ ఉంటే కేంద్రం వద్ద ఖాళీగా ఉన్న 10లక్షల 62 వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి. అవి నింపకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. రు భర్తీ చేయరు.. మేము చేసే ప్రయత్నం చేస్తే ఒప్పుకోరు. దమ్ముంటే తెలంగాణ పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవాలని హరీష్‌ ‌రావు సవాల్‌ ‌విసిరారు. వడ్లు కోనరు, డీజిల్‌ ‌ధర పెంచుతారు, ఎరువుల ధర పెంచుతరు, బాయిల కాడ టర్లు పెడుతరు.. ఉద్యోగాలు ఇవ్వరు. రైతులకు పెట్టుబడి పెంచుతారు.

ఒక్కజాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేరు. మెడికల్‌ ‌కాలేజీ ఇవ్వరు. ఇలా అన్ని వర్గాల వారికి, అన్ని విషయాల్లో బీజేపీ నష్టం చేసింది. బీజేపీ నాయకులకు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు హరీష్‌ ‌రావు. రాష్ట్రంలో అభివృద్ది చూసి తెలంగాణలో ఎందుకు పుట్టలేదా అని పక్క రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఇప్పటి వరకు పాలించిన జాతీయ పార్టీలు అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ‌హయాంలో అభివృద్ది జరుగుతుంటే అన్ని రంగాల ప్రజలు తిరిగి తెలంగాణకు వస్తున్నారని తెలిపారు. ఇతర పార్టీల వారు అది ఓర్వలేక.. గగ్గోలుపెడుతున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు ఇతర ప్రభుత్వాల పాలనలో మోసపోయాం. సీఎం కేసీఆర్‌ ‌హయాంలో ఇప్పుడిప్పుడే బాగు పడుతున్నాం. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఇంకా బలపడాలి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు త్వరగతిన పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేయలనుకున్నాం. కానీ.. ఈ ప్రాంతంలో ఉన్న కొందరు నాయకులు కేసులు వేసి అడ్డుకోవడం వల్ల ఆలస్యమైంది. తొందర్లోనే ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలను ససశ్యామలం చేస్తాం. గతంలో తండాలు అన్ని రకాల సమస్యలను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా తాగునీరు, విద్య ,వైద్యం కోసం ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ వచ్చాక ఎంతో ప్రగతిని సాధించాం. ఏడేళ్లలో తీసుకువచ్చిన అభివృద్ధితో అందరం సంతోషంగా ఉంటున్నామని వివరించారు.

Leave a Reply