Take a fresh look at your lifestyle.

శ్రీపెరంబుదూర్‌ ‌హత్యాకాండకు 30 యేండ్లు

” ‌పెరుగుతున్న శాస్త్ర విజ్ఞానం అందుబాటుతో ఉగ్ర మూకలు రెచ్చి పోతున్నాయి. ఇటువంటి వారిని ఉపేక్షించకూడదు. దేశ శక్తిని మొత్తం ఉపయోగించి ఎదిరించాలి. ఉగ్రవాదం, తీవ్ర వాదం కేవలం భారతదేశం లేదా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సమస్య కాదు. నేడు ఇది అంతర్జాతీయ సమస్యగా పరిణమించింది. ఉగ్రవాదులను, తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న సామాజిక, రాజకీయ, మత పరమైన వ్యక్తులను, సంస్థలను సాక్ష్యాలతో సహా నిరూపించి బహిరంగంగా శిక్షించాలి. అపుడే దేశానికి మనశ్శాంతి. అదే సమయంలో యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా చేయాలంటే ప్రభుత్వం అందరిదీ అనే భావన కల్పించాలి. ప్రభుత్వాలు పారదర్శకంగా పని చేయాలి.”

తమ భావాలను, బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించే వారు, తమస్వీయ విషయాల రక్షణ కొరకు, సమాజ వ్యతిరేక మార్గాలను ఎంచుకొనేవే ఉగ్రవాదం మరియుతీ వ్రవాదం. మానసికంగా చూస్తే ఇదో రుగ్మత. సామాజికంగా చూస్తే ఇదో పైశాచికత్వం, మతపరంగా చూస్తే ఇది నిషిద్ధం. ప్రపంచ వ్యాప్తంగాఉగ్రవాద మరియు తీవ్రవాద కార్యకలాపాల మూలంగా ఎంతోమంది అమాయకులైన ప్రజలు బలవుతున్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం పదాలకు నిర్వచనాలు వేరైనా వాటి ప్రభావం మాత్రం సమాజంపై ఎక్కువగా ఉంటుంది. ఉగ్రవాదం, తీవ్రవాదం జాతీయ ప్రయోజనాలను విచ్ఛిన్నం చేస్తాయి. అభివృద్ధి కుంటుపడుతుంది. సమాజంలో అశాంతి నెలకొంటుంది. ఇటీవలి కాలంలో ఇవి అంతర్జాతీయ సమస్యలుగా పరిణమించాయి. భారత్తో పాటు చాలా దేశాలు ఈ సమస్యతో సతమతమవుతున్నాయి.. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, హైదరాబాద్లలో జరుగుతున్న బాంబు పేలుళ్లు, కశ్మీర్లో నిత్యం జరిగే అల్లర్లు భారత ఐక్యతకు, సమగ్రతకు ప్రధాన సవాళ్లుగా పరిణమించాయి.

ఈ ఉగ్రవాద ఫలితంగానే అత్యంత పిన్న వయసులో దేశప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన రాజీవ్గాంధీ తన ప్రాణాలు కోల్పోవటం జరిగింది. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ ఎల్టీటీ ఈదాడిలో కన్నుమూసి నేటికి ముప్పైఏళ్ళు . 1991 మే 21న విశాఖపట్నంలో సార్వత్రికఎన్నికల బహిరంగసబలోపాల్గొని అందరికీవీడ్కోలుచె•్ప విమానాశ్రయం నుంచి మద్రాసు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గాన శ్రీపెరంబుదూరు ఎన్నికల సభకు వెళ్లిన రాజీవ్వే లాది ప్రజల సమక్షంలో దారుణ హత్యకు గురి కావడం యావత్ప్ర పంచాన్ని దిగ్భ్రాంతి పర్చింది. వేదిక పైకి వెళ్ళడానికి ముందు అందరికీ గౌరవ సూచకంగా నమస్కారాలు పెడుతున్న సమయంలో నళిని, శ్రీలంక జాతీయుడైన ఆమె భర ్త మురుగన్‌ ఎల్టీటీ ఉగ్రవాదులతో కలిసి రాజీవ్‌ ‌గాంధీ హత్యకు కుట్ర పన్నారు. ఎల్టీటీఈ ఆత్మాహుతి సభ్యురాలు రాజీవ్‌గాంధీ కాళ్ళకు మొక్కి, ఆర్డీ ఎక్స్ ‌బెల్టు బాంబును పేల్చింది.

ఒక్కసారిగా విస్ఫోటనం, హాహాకారాలు, ఆర్తనాదాలు, గాలిలో ఎగిరిపడిన శరీభాగాలు తునాతునకలుగా మారిన రాజీవ్‌ ‌శరీరం. దేశమంతా విషాదం. ఆ ఆత్మాహుతి దాడిలో మరో 26 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. అది దేశం మొత్తం స్తంభించిన సమయం. తల్లి ఇందిరాగాంధీ మరణించిన తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన యువకుడు అందరూ అభిమానించే రాజీవ్‌ ‌చిన్న వయసులోనే దుర్మరణం చెందారు. ఇక రాజీవ్‌ ‌హత్య నుంచి మే 21 జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుతూ వస్తున్నారు. తీవ్రవాద చర్యలు రూపు మాపి, దేశ ప్రజలు సహజీవనంతో మెలగాలన్నది ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. తీవ్ర వాదాన్ని నిర్మూలించేందుప్రతి ఒక్కరూ సహకరించాలన్న భావాన్ని ప్రజల్లో కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించి వారి చేత తీవ్రవాద వ్యతిరేక దినం ప్రతిజ్ఞ చేయిస్తారు.

పెరుగుతున్న శాస్త్ర విజ్ఞానం అందుబాటుతో ఉగ్ర మూకలు రెచ్చి పోతున్నాయి. ఇటువంటి వారిని ఉపేక్షించకూడదు . దేశ శక్తిని మొత్తం ఉపయోగించి ఎదిరించాలి. ఉగ్రవాదం, తీవ్ర వాదం కేవలం భారతదేశం లేదా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సమస్య కాదు. నేడు ఇది అంతర్జాతీయ సమస్యగా పరిణమించింది.ఉగ్రవాదులను, తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న సామాజిక, రాజకీయ, మత పరమైన వ్యక్తులను, సంస్థలను సాక్ష్యాలతో సహా నిరూపించి బహిరంగంగా శిక్షించాలి . అపుడే దేశానికి మనశ్శాంతి. అదే సమయంలో యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా చేయాలంటే ప్రభుత్వం అందరిదీ అనే భావన కల్పించాలి. ప్రభుత్వాలు పారదర్శకంగా పని చేయాలి. ఎడ్యుకేషన్‌ ‌యాక్ట్ ‌విధిగా అమలు చేయాలి. గుమాస్తాగిరికి దారి చూపుతున్న విద్యా వ్యవస్థను తీసి వేసి స్వయం ఉపాధి కల్పించే విద్యను నేర్పాలి. బాల్యం నుంచే తరగతుల్లో అన్ని కులాలు, మతాలు ఒకటేనని బోధించాలి. నైతిక తరగతులను నిర్వహించాలి. దేశంలో ప్రాంతీయ అసమానతలు, ఆదాయ అసమానతలు, పేదరికం, అధికార కేంద్రీకరణ, నిరుద్యోగం, అల్పవర్గాల అణచివేత, లాంటి సమస్యలను వేర్లతో సహా తీసి వేయాలి. అదే ఉగ్ర వాద, తీవ్ర వాద దాడుల్లో ఆశువులు బాసిన వారందరికి మనం ఇచ్చే ఘనమైన నివాళి.

md khaza
డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387

Leave a Reply