Take a fresh look at your lifestyle.

30 ‌రోజుల్లో విచారణ పూర్తి

పక్కా ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
కేసు మానిటరింగ్‌ అధికారిగా సైబరాబాద్‌ ‌సిపి సజ్జన్నార్‌
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. దిశపై అత్యాచారం చేసి ఆమె బతికుండగానే నిప్పంటించి హత్య చేసిన కిరాతకులకు నెల రోజుల్లోనే శిక్ష పడేలా పక్కాగా ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ కేసు విచారణను త్వరితగతిన ముగించడానికి ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు సైతం ఏర్పాటయింది. దీంతో మొత్తం కేసు మానిటరింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న సైబరాబాద్‌ ‌సీపీ సజ్జన్నార్‌ ‌శంషాబాద్‌ ‌డిసిపి ప్రకాశ్‌ ‌రెడ్డి ఆధ్వర్యంలో మరో ఐపీఎస్‌ అధికారితో పాటు నలుగురు డిసిపి స్థాయి అధికారులు క్షుణ్నంగా విచారించనున్నారు. మొత్తం 11 ప్రత్యేక విచారణ బృందాలు ఘటనకు సంబంధించిన ఏ ఒక్క ఆధారాన్నీ వదిలిపెట్టకుండా సేకరించాలన్న ప్రయత్నంలో ఉన్నాయి. నేరానికి సంబంధించి నిందితుల ఆధారాల సేకరణకు క్లూస్‌ ‌టీం, ఘటన జరిగిన రోజు నిందితులు ఎక్కడెక్కడ సంచారించారనే అంశంపై సిసి కెమెరా ఫుటేజ్‌ ‌సేకరణకు మరో బృందం, దిశ హత్య జరిగిన ప్రాంతంలో లభించిన వస్తువుల విశ్లేషణకు నలుగురు మహిళా అధికారుల కోసం ఈ ప్రత్యేక విచారణ బృందాలను నియమించారు. ఒక్కో విచారణ బృందంలో నలుగురు అధికారులు ఉన్నారు. ఏమాత్రం భయం లేకుండా పక్కా ప్రణాళికతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఘటన జరిగిన రోజు నిందితులు ఎక్కడెక్కడ సంచరించారు అనే అంశంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.. మొత్తం ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను పక్కాగా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, పోలీసులు ఈ కేసు విచారణకు సంబంధించి విషయాలేవీ బయటికి పొక్కకుడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం…గురువారం నిందితులను తీసుకువెళ్లి సీన్‌ ‌రీ కన్‌‌స్ట్రక్షన్‌ ‌చేయించగా, దిశ సెల్‌ఫోన్‌ను పాతిపెట్టిన స్థలాన్ని తవ్వించి ఆమె సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే, ఘటన జరిగిన రోజు ఆమె ధరించిన చినిగిపోయిన దుస్తులు సేకరించినట్లు తెలిసింది. . దిశ టోల్‌గేట్‌ ‌వద్ద తన స్యూటీని
పార్క్ ‌చేసి తిరిగి ఆ ప్రాంతానికి తిరిగి చేరుకున్నప్పటి వరకు ప్రతీ నిమిషం వచ్చింది మొదలు ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేసి నిప్పంటించి లారీలో పారిపోవడం వరకు ఏ సమయంలో ఏం జరిగింది అనే అంశాలపై నిందితులను వేర్వేరుగా ఒకసారి, అందరిని కలిపి ఒకసారి తమదైన శైలిలో విచారించి సమాధానాలు రాబట్టినట్లు సమాచారం. అసలు ఈ మొత్తం ఘటనకు ప్రధాన సూత్రధారి ఎవరు ? అత్యాచారం జరపాలన్న ఆలోచన ఎవరిది ? అ తరువాత హత్య ఎలా చేయాలి ? ఎలా పారిపోవాలి వంటి అంశాలన్నీంటినీ వరుస క్రమంలో విచారించినట్లు సమాచారం.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!