Take a fresh look at your lifestyle.

30 ‌రోజుల్లో గ్రామాల్లో గుణాత్మకమార్పు.

  • ప్రణాళిక ప్రకటించిన సీఎం కేసీఆర్‌
  • పరిశుభ్రమైన వాతావరణంలో దసరా జరుపుకోవాలని పిలుపు
ఫోటో: రాజేంద్రనగర్‌ ‌గ్రాణాభివృద్ది సంస్థలో గ్రామప్రణాళికలపై జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్‌

తెలంగాణ పల్లెసీమలు దేశంలోని ఇతర రాష్ట్రాలు వచ్చి నేర్చుకునే  ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే ప్రధాన లక్ష్యంతోచేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విస్తృత ప్రజా భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు పిలుపునిచ్చారు. 30 రోజుల తర్వాత ఖచ్చితంగా గ్రామ ముఖ చిత్రం మారితీరాలని, దసరా పండుగను ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో జరుపుకోవాలని సిఎం తన ఆకాంక్ష వ్యక్తం చేశారు. గ్రామాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చే బృహత్తర ప్రయత్నంలో భాగంగా గ్రామ పంచాయతీలకు కావాల్సిన అధికారాలు, విధులు, నిధులను ప్రభుత్వం అందించిందని సిఎం అన్నారు. గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు కూడా అధికారాలు, బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సిఎం వెల్లడించారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలని, నియంత్రిత పద్ధతిలో విస్తృత ప్రజా భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి జరగాలని సిఎం నిర్దేశించారు. పల్లెల ప్రగతికి మంచి మార్గం వేయడానికి అమలు చేసే 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేసే బాధ్యత ప్రజల మీదే ఉందన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములై, ఏ ఊరి ప్రజలే ఆ ఊరి కథానాయకులై తమ గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని, అవసరమైన చోట ప్రజలే శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు నిబద్ధతతో పని చేసి, తెలంగాణ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతారని తాను ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్లు సిఎం చెప్పారు. పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా చేయడం, నిధుల సద్వినియోగం, ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ది పనులు నిర్వహించడం అనేది నిరంతరం సాగాలని, దీనికోసం ఈ 30 రోజుల ప్రణాళికతో మంచి ఒరవడి ప్రారంభం కావాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని సిఎం అన్నారు. కలెక్టర్లు ఆ నాయకత్వం వహించాలని, పంచాయతీ రాజ్‌ ‌శాఖ అధికారులు నిబద్ధతతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌  ‌బాధ్యతలు పంచుకునేందుకు ముఖ్య శాఖలకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని, డిప్యూటీ కలెక్టర్‌ ‌లేదా మరో హాదా కల్పిస్తామని, వారిలో ఒకరిని పంచాయతీ రాజ్‌ ‌శాఖకు కేటాయిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి ముఖ్య సేవకుడు అనే భావనతోనే తానుంటానని, అధికారులు కూడా అలాగే ప్రజాసేవకులు అనుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయని సిఎం అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 60 లేదా 61 సంవత్సరాలకు పెంచుతామని సిఎం స్పష్టం చేశారు. అన్ని శాఖల్లో ఉద్యోగుల  ప్రమోషన్‌ ‌చార్టు రూపొందించాలని, తమకు ఏ తేదీన ప్రమోషన్‌ ‌వస్తుందో ఉద్యోగికి ముందే తెలిసి ఉండాలని, పదోన్నతుల కోసం పైరవీలు చేసే దుస్థితి పోవాలని సిఎం అన్నారు. ఉద్యోగులు కూడా పదోన్నతుల విషయంలో వేసుకున్న కేసులను ఉపసంహరించుకోవాలని, అందరికీ పదోన్నతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అవసరమైతే సూపర్‌ ‌న్యూమరీ పోస్టులను కూడా సృష్టిస్తామని వెల్లడించారు. మండల, జిల్లా పరిషత్‌ ‌సమావేశాల్లో అధికారులు, ఉద్యోగులను పరుష పదజాలంలో ధూషించడాన్ని ఇకపై ప్రభుత్వం సహించదని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని సిఎం వెల్లడించారు. వికారాబాద్‌ ‌జిల్లాను చార్మినార్‌ ‌జోన్‌ ‌లో కలుపుతూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సిఎం ఆదేశించారు.

30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై తెలంగాణ స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌రూరల్‌ ‌డెవలప్మెంట్‌ ‌లో మంగళవారం జరిగిన రాష్ట్ర సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ముఖ్య అతిథిగా పాల్గొని, అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. పంచాయతీ రాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావుతో పాటు ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.‌కె.జోషితో పాటు సీనియర్‌ అధికారులు,టిఆర్‌ఎస్‌ ‌పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు వినోద్‌ ‌కుమార్‌, , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల కలెక్టర్లు, డిపిఓలు, డిఎఫ్‌ఓలు, సిఇవోలు, డిఎల్పివోలు, ఎంపిడివోలు, ఎంపివోలు, డిస్కమ్‌ ‌ల సిఎండిలు రఘుమారెడ్డి, గోపాలరావుతో పాటు ఎస్‌.ఇ.‌లు ఈ సదస్సులో పాల్గొన్నారు.

‘‘తెలంగాణ ప్రభుత్వం భారీ పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చింది. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాల ఏర్పాటు చేసింది.తండాలు, గూడాలు, శివారు పల్లెలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటయ్యాయి. గ్రామ పంచాయతీల సంఖ్య 8,690 నుంచి12,751 కుపెరిగాయి.3,146 మంది ఎస్టీలు సర్పంచులు అయ్యే అవకాశం కలిగింది.గ్రామీణ పరిపాలనా విభాగాలు పరిపాలనకు, ప్రభుత్వ కారక్రమాలను అమలు చేయడానికి అనువుగా ఉన్నాయి. పరిపాలనా సంస్కరణకు కొనసాగింపుగా ప్రజలకు మంరిత మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు,విధులు, నిధుల వినియోగంలో సంపూర? స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం కొత్త పంచాయతీ రాజ్‌ ‌చట్టం తెచ్చింది. ఎస్‌.‌కె.డే కృషి వల్ల ఒకనాడు ఉద్యమంగా కొనసాగిన పంచాయతీ రాజ్‌ ‌వ్యవస్థకు పునర్వైభవం తేవడం, గ్రామ వికాసంలో విస్తృతమైన ప్రజా భాగస్వామ్యం కల్పించడం, గ్రామాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి బాటలు వేయడం, పచ్చని, పరిశుభ్రమైన పల్లె సీమల నిర్మాణం, ప్రణాళికాబద్ధంగా నిధులు వినియోగించడం, అజాగ్రత్త, అలసత్వానికి ఆస్కారం లేని పాలన అందించడం, ప్రజా ప్రతినిథులు, అధికారుల్లో జవాబుదారీతనం పెంచడానికి ప్రభుత్వం కొత్త పంచాయతీ రాజ్‌ ‌చట్టం తెచ్చింది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వివరించారు.

గ్రామ పంచాయతీలు నేల విడిచి సాము చేయవద్దని, గ్రామ పంచాయతీలు ఏకీకృతంగా కాకుండా ప్రజలందరి భాగస్వామ్యంతో వ్యవస్థీకృతంగా గ్రామాల రూపురేఖలు మార్చాలని సిఎం పిలుపునిచ్చారు.
‘‘గ్రామ స్థాయిలో ప్రభుత్వమే చాలా పనులు నిర్వహిస్తున్నది. మిషన్‌ ‌భగీరథ ద్వారామంచినీరు అందిస్తున్నది. విద్యుత్‌ ‌శాఖ ద్వారా నిరంతర విద్యుత్‌అం‌దిస్తున్నది. వ్యవసాయ శాఖ ద్వారా రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు అమలు చేస్తున్నది. మిషన్‌ ‌కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కావాల్సిన ఆర్థిక ప్రేరణ ప్రభుత్వమే అందిస్తున్నది. పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యపు అన్నం ప్రభుత్వమే పెడుతున్నది. అంగన్‌ ‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందిస్తున్నది. రేషన్‌ ‌షాపుల ద్వారానే బియ్యం, ఇతర సరుకులుఅందిస్తున్నది. ఆసరా పెన్షన్లు, కేసీఆర్‌ ‌కిట్స్, ‌కల్యాణలక్ష్మి లబ్ది ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే జరుగుతున్నది. రహదారుల నిర్మాణం, వంతెనల నిర్మాణం, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం తదితర పనులన్నీ ప్రభుత్వమే గ్రామ పంచాయతీలపై ఎలాంటి భారం పడకుండానే నిర్వహిస్తున్నది’’ అని ముఖ్యమంత్రి వివరించారు.

‘‘ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలపై కొన్ని నిర్ధిష్ట, ముఖ్యమైన పనులు నిర్వహించే బాధ్యత ఉన్నది. ప్రజల విస్తృత భాగస్వామ్యాన్ని పెంపొందించడం,పచ్చదనం పెంచడం, పరిశుభ్రత కాపాడడం, వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించడం, వాటికి అనుగుణంగా బడ్జెట్‌ ‌రూపొందించడం, నియంత్రిత పద్ధతిలో నిధుల వినియోగం, క్రమం తప్పకుండా పన్నులు వసూలు చేయడం, విద్యుత్‌ ‌బిల్లుల లాంటి చెల్లింపులు చేయడం, వీధి లైట్లను సరిగ్గా నిర్వహించడం’’ లాంటి పనులు గ్రామ స్థాయిలో పంచాయతీలు నిర్వహించాల్సిన ముఖ్యమైన విధులు’’ అని ముఖ్యమంత్రి నిర్దేశించారు.

ప్రజలు తలచుకుంటే, ఉద్యమ స్పూర్తితో పనిచేస్తే తప్పక మంచి ఫలితాలు వస్తాయని, దీనికి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయని సిఎం కేసీఆర్‌ అన్నారు.
‘‘ఎస్‌.‌కె. డే గ్రామీణాభివృద్ది కోసం పంచాయతీ రాజ్‌ ‌వ్యవస్థకు పురుడు పోశారు. కూసం రాజమౌళి అనే వ్యక్తి కృషి ఫలితంగా వరంగల్‌ ‌జిల్లా గంగదేవిపల్లి ఆదర్శ గ్రామమైంది. గంగదేవిపల్లిలో 26 గ్రామ కమిటీలున్నాయి.నిజామాబాద్‌ ‌జిల్లా అంకాపూర్‌ ‌గ్రామం అభివృద్దికి,  గ్రామస్తులు, ముఖ్యంగా మహిళల సాధికారితకు సాక్ష్యంగా నిలబడింది. మురార్జీ దేశాయ్‌ ‌కృషి వల్ల ముంబాయి నగరంలో ట్రాఫిక్‌ ‌నియంత్రణ సాధ్యమైంది’’ అని ముఖ్యమంత్రి సోదాహరణంగా చెప్పారు.
30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడానికి గ్రామస్థాయిలో ఎవరి బాధ్యత ఎంతో చెప్పడానికి ముందే ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చి ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చెప్పారు.
‘‘ ప్రభుత్వం కొత్త పంచాయతీ రాజ్‌ ‌చట్టం వచ్చింది. పంచాయతీ రాజ్‌ ‌శాఖలో అన్ని ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నది. ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు వచ్చి నిధులకు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా కలిపి, గ్రామ పంచాయతీలకు నెలకు 339 కోట్ల చొప్పున నిధుల విడుదల చేస్తున్నది. ఒక ఏడాది ఖర్చు చేయగా, మిగిలిన కొన్ని నిధులను వచ్చే ఏడాది బదిలీ చేసేలా చట్టంలో నిబంధన పెట్టింది. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 36 వేల మంది సఫాయి కర్మచారుల జీవన స్థితిగతులను పరిగణలోకి తీసుకుని, వారి వేతనాలను నెలకు రూ.8,500 చెల్లించాలని నిర?యించింది. చెత్త సేకరణ కోసం, చెట్లకు నీళ్లు పోయడం కోసం ట్రాక్టర్లు కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సర్పంచులపై కలెక్టర్లు చర్య తీసుకుంటే, స్టే ఇచ్చే అధికారం మంత్రులకు లేకుండా చట్టంలోనే నిబంధనలున్నాయి. సర్పంచులు, అధికారుల అధికారాలు, బాధ్యతలు, విధులను స్పష్టంగా పేర్కొన్నది’’ అని ముఖ్యమంత్రి వివరించారు.
సదస్సులో ప్రసంగం అనంతరం అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు, లేవనెత్తిన సందేహాలకు ముఖ్యమంత్రి సమాధానాలు ఇచ్చారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy