Take a fresh look at your lifestyle.

30‌న మోడీ ప్రమాణ స్వీకారం..?

కేబినేట్‌ ‌కూర్పుపై బిజెపి కసరత్తు
మంత్రివర్గ తీర్మానంతో రద్దు కానున్న లోక్‌సభ

ఫోటో : ‌భాజాపా అగ్రనేత అద్వానీని కలసి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ, అమిత్‌షాలు

కేంద్రంలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కసరత్తు మొదలెట్టింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు ఇప్పటికే ఎన్డీఏ మిత్రపక్షాలతో మంత్రిత్వశాఖల కేటాయింపుపై మంతనాలు ప్రారంభించారు. ఐతే కేంద్ర కేబినెట్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ ‌జైట్లీ శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా కేబినెట్‌ ‌టింగ్‌కు హాజరుకాలేదని సమావేశానంతరం బీజేపీ వర్గాలు తెలిపాయి. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇక మోదీ కేబినెట్‌లో కొనసాగకపోవచ్చని బీజేపీ నేత ఒకరు వెల్లడించారు. ఈ కారణంగానే బీజేపీ విజయోత్సవ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. జైట్లీ అమెరికాలో చికిత్స నిమిత్తం వెళ్లినప్పుడు పియూశ్‌ ‌గోయల్‌ ‌తాత్కాలిక ఆర్థిక మంత్రిగా కొనసాగిన విషయ తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త కేబినెట్‌లో పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిత్వ శాఖను గోయల్‌కు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతకుముందు కేంద్ర కేబినెట్‌ ‌సమావేశం ముగిసింది. 16 వ లోక్‌సభను రద్దు చేస్తూ ఇందులో తీర్మానం చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రాంనాథ్‌ ‌కోవింద్‌కు ప్రధాని మోదీ పంపారు. జూన్‌ ‌మూడో తేదీతో 16 వ లోక్‌2‌సభ పదవీ కాలం ముగియనుంది. ఆ లోపే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంటుంది. గతంలో ప్రధానిగా మోదీ మే 26 వ తేదీన బాధ్యతలు స్వీకరించారు.అయితే ఈసారి కూడా ఆ తేదీనే బాధ్యతలు స్వీకరించాలని అనుకున్నా కొన్ని కారణాల రీత్యా, జాతక కారణాల రీత్యా మే 30 వ తేదీన మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీటితో పాటు ఎవరెవరికి కేబినెట్‌లో ఎవరెవరిని తీసుకోవాలి? ఏ సామాజిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ప్రధాని చర్చించినట్లు సమాచారం. గత కేబినెట్‌లో కేబినెట్‌ ‌హోదా కంటే స్వతంత్ర హోదా కలిగిన మంత్రులే ఎక్కువగా ఉండేవారు. కానీ ఈసారి మాత్రం ఆ అంశాన్ని సమం చేయాలని మోదీ యోచిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy