Take a fresh look at your lifestyle.

తెలంగాణలో కొత్తగా 3 వేల 961 కేసులు

మరో 30మంది చనిపోయినట్లు నిర్ధారణ
రాష్ట్రంలో కొరోనా స్వైర విహారం కొనసాగుతోంది. లాక్‌ ‌డౌన్‌ ఆం‌క్షలు అమలు చేస్తున్నా కేసుల ఉధృతితోపాటు మరణాలు ఏ మాత్రం తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లో 30 మంది కొరోనా నుంచి కోలుకోలేక కన్నుమూశారు. మొత్తం 62వేల 591 మందికి కొరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా 3 వేల 961 మందికి కొరోనా సోకినట్లు నిర్దారణ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల 559 మంది కొరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా హాస్పిల్స్ ‌నుండి డిశ్చార్జ్ ‌కాగా 30 మంది కొరోనా• నుంచి కోలుకోలేక కన్నుమూశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 49 వేల 341 కేసులు యాక్టివ్‌ ‌గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కొరోనా మరణాల రేటు 1.1 శాతం ఉండగా తెలంగాణలో 0.56 శాతం నమోదు అయింది. అలాగే కొరోనా నుంచి కోలుకున్న వారి శాతం దేశ వ్యాప్తంగా 84.8 శాతం ఉండా తెలంగాణలో 90.17 శాతం నమోదు అయింది.

Leave a Reply