Take a fresh look at your lifestyle.

బీజాపూర్‌ ‌జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య… ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ ‌జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా గల్గాం అడవిలో మంళవారం ఉదయం నుంచి పోలీసులు కూంబింగ్‌ ‌చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరిగాయి.

ఊసూరు పోలీసు స్టేషన్‌ ‌పరిధిలోని ఉసూర్‌-‌గల్గాం గ్రామాల మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఒక జవాన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన జవాన్‌ అఖిలేష్‌ను బీజాపూర్‌ ‌జిల్లా హాస్పిటల్‌కి తరలించినట్లు ఎస్పీ కమలోచన్‌ ‌కశ్యప్‌ ‌తెలిపారు.

Leave a Reply