Take a fresh look at your lifestyle.

దేశంలో అపరిష్కతంగా 3 కోట్ల కేసులు

త్వరగా న్యాయం జరిగేలా చూడాలి.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచన
అత్యున్నత న్యాయస్థానం నుంచి కిందిస్థాయి కోర్టుల వరకు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న అపరిష్క•త కేసుల విషయంలో ప్రభుత్వంతోపాటు, సుప్రీమ్‌కోర్టు, హైకోర్టులు, న్యాయ మంత్రిత్వ శాఖలు దృష్టిపెట్టాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. అన్ని స్థాయిల్లో 3కోట్లకు పైగా కేసులు అపరిష్క•తంగా ఉండటం విచారకరమన్నారు. కేసుల సంఖ్య ఇలా పెరుగుతున్నందున కీలకమైన కేసుల్లో తీర్పు కూడా ఆలస్యమవుతోందన్నారు. తద్వారా సామాన్యులకు న్యాయపక్రియ చాలా ఖరీదైన వ్యవహారంగా మారుతున్నదన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ అనుబంధ డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌న్యాయకళాశాల 76వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వెబినార్‌లో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సమాజంలోని పేద, అణగారిన వర్గాలకు న్యాయపరమైన సహాయం చేయాలని..వారి జీవితాలను మెరుగుపరిచేందుకు కృషిచేయాలని లా విద్యార్థులకు, యువ న్యాయవాదులకు ఉపరాష్ట్రపతి సూచించారు. నైతిక ప్రవర్తనను అలవర్చుకుని, నిర్భీతితో.. విధులు నిర్వహించాలన్నారు.

సమాజంలో మార్పు తీసుకురావడంలో న్యాయవాదుల పాత్ర కీలకమనే విషయాన్ని గుర్తించాలని.. ప్రజల్లోచైతన్యం తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. ‘జస్టిస్‌ ‌డిలేడ్‌ ఈజ్‌ ‌జస్టిస్‌ ‌డినైడ్‌’ అన్న మాటను ప్రస్తావిస్తూ.. కొన్ని సందర్భాల్లో అనవసరంగా కేసులను పొడగించడం, వాయిదా వేయడం జరుగుతోందన్నారు. దీనిపై న్యాయవాదులతో పాటు ఈ రంగంతో సంబంధమున్న ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరముందన్నారు. ఇది ఎవరినీ విమర్శించేందుకు అనడం లేదని..న్యాయశాస్త్రాన్ని అభ్యసించినవాడిగా, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నందున..తన దృష్టికి వచ్చిన అంశాలను ప్రస్తావిస్తున్నానన్నారు. క్లిష్టమైన చట్టాలను సరళీకృతం చేయాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి అన్నారు. వినియోగంలో లేని 1600కు పైగా చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిందని ఆయన గుర్తుచేశారు. ఈ దిశగా మరింత కృషి జరగాల్సి ఉన్నదన్నారు.

Leave a Reply