Take a fresh look at your lifestyle.

ధైర్యమే మందు రాష్ట్రంలో కొత్తగా 2,751 పాజిటివ్‌ ‌కేసులు

  • శుక్రవారం కొరోనాతో 9 మంది మృతి
  • జాగ్రత్త్రలు తీసుకుంటూ  కొరోనాను జయించవచ్చు 
  • తొలినాళ్ల పరిస్థితులను అధిగమించాం: మంత్రి ఈటల రాజేందర్‌

తెలంగాణలో కొరోనా వైరస్‌ ‌విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2,751 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,20,116కు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 9 మంది మరణించారు. దీంతో కొరోనా మృతుల సంఖ్య 808కి చేరింది. తాజాగా 1675 మంది కోవిడ్‌ ‌రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్చ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తంగా 89,350 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన హెల్త్ ‌బులెటిన్‌లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కొరోనా బాధితుల రికవరీ రేటు 76.49 శాతంగా ఉండగా.. తెలంగాణలో 74.3 శాతంగా ఉంది. కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎం‌సీలో 432 నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డిలో 185, మేడ్చల్‌ ‌జిల్లాలో 128 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి.

తొలినాళ్ల పరిస్థితులను అధి గమిం చాం ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌
‌కొరోనాకు ధైర్యమే మొదటి మందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌పునరుద్ఘాటించారు. కరోనాకు ఇపస్పటికైతే మందు లేకున్నా జాగ్రత్తలు తీసుకుంటూ ధైర్యంగా ఉండాలన్నారు. దీంతో మనం దానిని జయించవచ్చన్నారు. శనివారం హైదరాబాద్‌లోని •లిస్టిక్‌ ‌హాస్పిటల్‌ ‌చారిటబుల్‌ ‌ట్రస్ట్ ఆధ్వర్యంలో కొవిడ్‌ ‌రోగులకు చికిత్సలందించేందుకు ప్రభుత్వానికి ఉచితంగా వంద ఆక్సిజన్‌ ‌కాన్సన్‌‌ట్రేటర్లు అందించింది. కార్యక్రమానికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ‌సైబరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌ ‌హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్‌ ‌మాట్లాడుతూ కొరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, చర్యలు తీసుకుంటుందన్నారు. దవాఖానలో బెడ్లతో పాటు అవసరమైన ఆక్సీజన్‌ అం‌దుబాటులో ఉంచామన్నారు. కొరోనా నియంత్రణలో తొలినాళ్లకు ఇప్పటికీ అనేక చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా విలవిల లాడుతామో మరోసారి ఈ తరం చవిచూసిందన్నారు. ప్రకృతిని నమ్ముకొని, అల్లుకొని కోటానుకోట్ల జీవులు జీవిస్తున్నాయని, దానికి విరుద్ధంగా వెళ్లేది ఒకే ఒకజీవి మనిషి అన్నారు.

అందుకే ఆ మనిషిని జాగ్రత్తగా ఉండమని కరోనా హెచ్చరిక చేసినట్లుగా భావిస్తున్నానన్నారు. చరిత్రలో కరోనా కంటే ఎక్కువ మరణాల రేటు ఉన్న వైరస్‌లు వచ్చాయని తెలిపారు. కానీ వాటికి గురించి ఎక్కువ చర్చ జరుగలేదన్నారు. సార్స్ ‌వంద మందికి సోకితే ఎక్కువ మొత్తంలో చనిపోయే అవకాశం ఉందని, మెర్స్(‌మిడిల్‌ ఈస్ట్ ‌రెస్పెటరీ సిండ్రోమ్‌), ఎబోలా సోకితే కొరోనా కంటే ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం ఉంటుందన్నారు. వైరస్‌ ‌ప్రబలిన తొలినాళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఒకటే చర్చ జరిగిందని.. పది రోజుల్లో వెయ్యి పడకల హాస్పిటల్‌ ‌నిర్మించే టెక్నాలజీ, కమిట్‌మెంట్‌ ఉన్న దేశం చైనా కావడంతో వైరస్‌ను కట్టడి చేసిందన్నారని, 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో వైరస్‌ ‌ప్రబలితే కట్టడి సాధ్యం కాదని, శవాలు గుట్టలే ఉంటాయన్నారని గుర్తు చేశారు. దేశంలో ప్రస్తుతం మరణాల రేటు తక్కువగా, ఉందని ఎక్కువ సంఖ్యలో రోగులు కోలుకుంటున్నారన్నారు. కొరోనా మహమ్మారి నేపథ్యంలో బాధితులను వెలివేయకుండా వారికి మేమున్నామంటూ ధైర్యం ఇవ్వాలని, తద్వారా తొందరగా కోలుకునే అవకాశం ఉంటుందన్నారు. గతంలో పలు విషాదకర ఘటనలు జరిగాయని, ప్రస్తుతం రాష్ట్రంలో అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ ‌కమ్యూనిటీల్లో స్థానికంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తుండడంతో దవాఖానల్లో బెడ్లు ఖాళీగా ఉంటున్నాయన్నారు. వైరస్‌ ‌కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి ఈటల స్పష్టం చేశారు. అలాగే పోలీసుశాఖతో కొరోనా కట్టడిలో కృషి చేస్తుందని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కాన్సన్‌‌ట్రేటర్లు అందించిన •లిస్టిక్‌ ‌హాస్పిటల్‌ ‌చారిటబుల్‌ ‌ట్రస్ట్ ‌నిర్వాహకులను అభినందించారు.

Leave a Reply