Take a fresh look at your lifestyle.

నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి

రానున్న వర్ష కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెలాఖరులోగా వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ‌కృష్ణ భాస్కర్‌ ఆదేశాలు జారీ చేశారు.సిరిసిల్ల పట్టణంలోని స్వశక్తిపొదుపు భవన్‌లో వ్యవసాయ, సహకార, గ్రామీణాభివృద్ధి సంస్థ, మండల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో కలెక్టర్‌ ‌కృష్ణ భాస్కర్‌ ‌మాట్లాడుతూ మిషన్‌ ‌మోడ్‌లో ధాన్యం కొనుగోలు, లోడింగ్‌, అన్‌లోడింగ్‌ ‌జరిగేట్లుగా చూడాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్‌ ‌మిల్లులకు తరలించాల ని ఆయన అన్నారు.జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో 2.7లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుతుందని అంచనా వేశామని,ఇప్పటి వరకు 75 వేల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం మాత్రమే తరలించారని ఆయన అన్నారు.

రైతులనుండి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో తూకం సరిగా ఉందోలేదో సరిచూడాలని,ధాన్యం తరలించాల్సిన బాధ్యత జిల్లా మార్కెటింగ్‌ అధికారి,పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌లు చూసుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో జడ్పీ సిఇఓ గౌతంరెడ్డి,డిఆర్‌డిఓ కౌటిల్య రెడ్డి,జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్‌రెడ్డి,జిల్లా సహకార అధికారి బుద్దనాయుడు,మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌సమ్మయ్య,జిల్లా మార్కెటింగ్‌ అధికారి షాబుద్దీన్‌, ‌పౌరసరఫరాల సంస్థ డివిజనల్‌ ‌మేనేజర్‌ ఇర్ఫాన్‌ ‌మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply