Take a fresh look at your lifestyle.

పేద కుటుంబానికి ఆర్థికసాయం

చర్ల మండలం ఎర్రంపాడు గ్రామానికి చెందిన దూది రామే , ఆరుగురు సంతానం.ఈమే భర్త రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. అందరూ పసిపిల్లలు కావడంతోపాటు కుటుంబానికి ఆధారం లేక తినడానికి తిండి లేక అటు తల్లి కూలిపనులకు వెళ్లలేని పరిస్థితిలో ఉండి జీవనం సాగించడం కష్టతరమవుతుంది.ఈ కుటుంబం యొక్క దీన పరిస్థితిని చూసి స్పందించి గురువారం ట్రస్ట్ ‌సభ్యులు, ఫైర్‌ ‌కానిస్టేబుల్‌ ‌బండారి సతీష్‌ ‌జన్మదినం సందర్భంగా భద్రాచలం నుండి వచ్చి ఎర్రంపాడు గ్రామం లోని ఈ కుటుంబానికి నిత్యవసర వస్తువులు టమాటాలు, కందిపప్పు, మంచి నూనె, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు సభ్యులు తో పాటు 5000 ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ ‌వ్యవస్థాపకులు మురళి మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా కష్టకాలంలో ఉన్న కుటుంబానికి వారి వంతు ఆర్థిక సహకారం అందించి నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఇటువంటి మంచి మనసు ఉన్న వాళ్ల వలనే మానవత్వం ఇంకా బ్రతికే ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో జక్కిరెడ్డి .శ్రీనివాస్‌ ‌రెడ్డి,ఎస్కె. షరీఫ్‌, ‌భూక్య .రంజిత్‌ ‌నాయక్‌, ‌ట్రస్ట్ ‌వ్యవస్థాపకులు కొప్పుల.మురళి , కారం.నరేష్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply