Take a fresh look at your lifestyle.

టచ్‌లో 25 ‌మంది టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

2023లో తెలంగాణలో అధికారంలోకి వస్తాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

‌టీఆర్‌ఎస్‌, ‌మజ్లిస్‌ ‌పార్టీలు కుమ్మక్కై రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సం•య్‌ ‌విమర్శించారు. టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీలకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారనీ, ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించవద్దన్న ఉద్దేశ్యంతోనే వారిని పార్టీలో చేర్చుకోవడం లేదని తెలిపారు.

శుక్రవారం బండి సంజయ్‌ ‌నేతృత్వంలో పార్టీ నేతలు రాజాసింగ్‌, ‌రాంచందర్‌రావు, ప్రకాశ్‌ ‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ‌ప్రభాకర్‌ ‌రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. అనంతరం బండి సంజయ్‌ ‌మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ ‌కలసి రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. జీహెచ్‌ఎం‌సి ఎన్నికలు ముగిసి నెల రోజులు కావస్తున్నప్పటికీ పాలక మండలి ఏర్పాటు చేయడం లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌, ‌మజ్లిస్‌ ‌పార్టీలు కలసి రాష్ట్రంలో ప్రజా నిర్ణయాన్ని ఖూనీ చేస్తున్నాయని మండిపడ్డారు.మజ్లిస్‌ ‌సహకారంతోనే టీఆర్‌ఎస్‌ 56 ‌స్థానాలలో గెలిచిందనీ, లేని పక్షంలో ఆ స్థానాలలో కూడా టీఆర్‌ఎస్‌కు విజయం దక్కేది కాదని వ్యాఖ్యానించారు. మేయర్‌ ఎన్నిక, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఎందుకు చేయించడం లేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. 2023లో ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో ఓడిపోయిన కార్పొరేటర్లు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారనీ, కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని విమర్శించారు.

కాగా, సీఎం కేసీఆర్‌ ‌జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోవడం లేదని బండి సంజయ్‌ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్లు ఇస్తామని సీఎం మాట తప్పారని విమర్శించారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు ఏం చర్చించారో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. వేతన సవరణ సంఘం ఇన్ని రోజులు ఏం చేసిందనీ, సీఎంను చూసి ఉద్యోగ సంఘాలు ఎందుకు భయపడుతున్నాయో అర్థం కావడం లేదని బండి సం•య్‌ ‌వ్యాఖ్యానించారు.

Leave a Reply