Take a fresh look at your lifestyle.

నయీం కేసులో..25 మంది పోలీస్‌ అధికారులకు సిట్‌ ‌క్లీన్‌చిట్‌

ఫోరం ఫర్‌ ‌గుడ్‌ ‌గవర్నెన్స్ ‌లేఖకు సిట్‌ ‌సమాచారం

‌తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..యావత్‌ ‌దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్‌ ‌నయీం కేసులో మరో సంచలనం వెలుగుచూసింది. గ్యాంగ్‌స్టర్‌ ‌నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ ‌క్లీన్‌చిట్‌ ఇచ్చింది. నయీంకు సహకరించినట్లు 25 మంది పోలీసులపై ఆరోపణలున్నాయి. నయీంతో సంబంధాలున్నట్లు 25 మంది పోలీసులు ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 25 మంది పోలీస్‌ అధికారులపై ల్యాండ్‌ ‌సెటిల్‌మెంట్లు, బెదిరింపుల ఆరోపణలున్నాయి. అధికారులు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. అయితే ఈ ఆరోపణలపై ఎలాంటి సాక్ష్యాధారాలు లభించని కారణంగా 25 మందికి క్లీన్‌చిట్‌ ఇస్తున్నట్లు సిట్‌ ‌పేర్కొంది.

ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలతోపాటు 13 మంది సీఐలు, ఓ హెడ్‌కానిస్టేబుల్‌, ఇద్దరు కానిస్టేబుళ్లకు క్లీన్‌చిట్‌ ‌లభించింది. ఫోరం ఫర్‌ ‌గుడ్‌ ‌గవర్నెన్స్ ‌రాసిన లేఖకు శనివారం సిట్‌ ‌సమాచారం ఇచ్చింది. షాద్‌నగర్‌లో 2016, ఆగష్టు 8న గ్యాంగ్‌ ‌స్టర్‌ ‌నయీంను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 175కి పైగా సిట్‌ ‌చార్జ్‌షీట్లు దాఖలు చేసింది. ఇందులో 130కి పైగా కేసుల్లో 8 మంది రాజకీయ నాయకుల పేర్లు, ఇద్దరు అడిషనల్‌ ఎస్పీలతో పాటు ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలతో పాటు హెడ్‌కానిస్టేబుల్‌ ‌వరకు అందరికీ సిట్‌ ‌క్లీన్‌చిట్‌ ఇచ్చేసింది. కేసులో 25 మంది పోలీస్‌ అధికారుల పాత్రపై ఫోరం ఫర్‌ ‌గుడ్‌ ‌గవర్నెన్స్ ‌రాసిన లేఖకు సిట్‌ ‌చీఫ్‌ ‌నాగిరెడ్డిపై విధంగా సమాధానం ఇచ్చారు.

Leave a Reply