Take a fresh look at your lifestyle.

25 ‌మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌ ‌దత్‌

‌గత రెండు నెలల కాలంలో మావోయిస్టులు సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్గఢ్‌ ‌రాష్ట్రంలో 25 మంది అమాయక ఆదివాసి ప్రజలను పోలీస్‌ ఇన్ఫార్మర్ల నెపంతో పొట్టన పెట్టుకున్నారని  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌ ‌దత్‌ అన్నారు.అదేవిధంగా తెలంగాణ సరిహద్దు కలిగి ఉన్న జిల్లాలలో కూడా మావోయిస్టులు గత పదిహేను రోజులలో ఇద్దరూ అమాయక ప్రజలను చంపివేసినారని ఆయన అన్నారు.ప్రజలతో వారి అవసరాలు తీరిన తర్వాత వారినే పోలీసు ఇన్ఫార్మర్ల నెపంతో అనుమానిస్తూ చిత్రహింసలకు గురి చేసి చంపుతున్నారని పేర్కొన్నారు..ఇది ఎంతవరకు సమంజసంఅని ప్రశ్నించారు.

కావున ప్రజలు ఎవరూ కూడా మావోయిస్టులకు సహకరించడానికి ఛత్తీస్గఢ్‌ ‌రాష్ట్రంలోనికి వెళ్ళ వద్దని కోరారు.ఛత్తీస్గఢ్‌ ‌రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో పోలీసులు గస్తీ దళాలతో అటవీ ప్రాంతమంతా కూంబింగ్‌ ‌నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎవరైనా పట్టుబడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఆయన హెచ్చరించారు.చర్ల,దుమ్ముగూడెం మరియు భద్రాచలం ప్రాంతాలలో కూడా పోలీసు నిఘాను పెంచడం జరిగిందని ఎస్పీ సునీల్‌ ‌దత్‌ ‌తెలిపారు.కాబట్టి ప్రజలు ఎవరూ కూడా మావోయిస్టులకు సహకరించడానికి ఛత్తీస్గఢ్‌ ‌రాష్ట్రంలోనికి వెళ్ళరాదని కోరారు.అలాగే ఆర్‌ఎం‌పీ డాక్టర్లు గానీ మరియు వ్యాపారులు గానీ మావోయిస్టు పార్టీకి సహకరించి మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply