Take a fresh look at your lifestyle.

పెండింగ్‌ ‌జీతాలడిగితే అరెస్ట్ ‌చేయిస్తారా? టీడీపీ నేత నారా లోకేష్‌ ‌మండిపాటు

అమరావతి,ఆగస్ట్ 4 : ‌లక్షలాది మంది అవ్వాతాతలకు పెన్షన్లు లేవని టీడీపీ నేత నారా లోకేష్‌ ‌మండిపడ్డారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఖాతాలో పెన్షన్‌ ‌పడలేదన్నారు. ఒకటో తేదీ జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 108 సిబ్బందికి 3 నెలలుగా వేతనాలివ్వలేదన్నారు.

ఫ్రంట్‌లైన్‌ ‌వారియర్స్, ‌పారిశుధ్య కార్మికులు తమ పెండింగ్‌ ‌జీతాలడిగితే అరెస్ట్ ‌చేయించిన జగన్‌రెడ్డి… సాక్షి పేపర్‌కి సీఎఫ్‌ఎంఎస్‌ ‌నుంచి ఈ రోజు 16.87 కోట్లు విడుదల చేశారని ఆరోపించారు. సాక్షి పేపర్‌కి ఇప్పటివరకూ 220 కోట్లు యాడ్స్ ‌పేరుతో కట్టబెట్టారని చెప్పారు. భారతి సిమెంట్‌ ‌ధర పెంచి ఏపీ ప్రభుత్వంతో కొనుగోలు చేయించారని వ్యాఖ్యానించారు.

మురళీమోహన్‌కు ఏపీ హైకోర్టులో ఊరట..!
అమరావతి,ఆగస్ట్ 4 : ‌సినీ నటుడు జయభేరీ ప్రాపర్టీస్‌ ‌ఛైర్మన్‌ ‌మురళీమోహన్‌, ఆయన కుటుంబ సభ్యులకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. స్థలం తీసుకుని మోసం చేసినట్లు భూ యజమాని ఫిర్యాదుతో ఏపీలో కేసు నమోదు చేశారు ఏపీ సీఐడీ పోలీసులు. 41 ఏ సెక్షన్‌ ‌కింద మురళీమోహన్‌కు నోటీసులిచ్చి… గురువారం విచారణకు హాజరుకావాలని కోరారు. సీఐడీ నోటీసులపై హైకోర్టులో మురళీమోహన్‌ ‌క్వాష్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు. సివిల్‌ ‌వివాదాన్ని క్రిమినల్‌ ‌వివాదంగా మార్చటం పట్ల పిటిషనర్‌ ‌న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువురి మధ్య ఒప్పందాన్ని జయభేరీ ప్రాపర్టీస్‌ ఉల్లంఘించలేదన్నతన వాదనలు వినిపించారు పిటిషనర్‌ ‌న్యాయవాది. ఈ కేసులో అన్నిరకాల తదనంతర చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply